జైలర్ సినిమాతో సౌత్ ఆడియన్స్‌ను కూడా ఫిదా చేశారు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్. ఈ మూవీ తరువాత తమిళ ప్రేక్షకులకు దగ్గరైన శివన్న, రీసెంట్ ఇంటర్వ్యూలో ఇచ్చిన ఓ స్టేట్మెంట్‌తో కోలీవుడ్ ఆడియన్స్‌ను తన వైపు తిప్పుకున్నారు. ఇన్నాళ్లు కన్నడ సినిమా మాత్రమే అని ఫిక్స్ అయిన సాండల్‌వుడ్ సీనియర్ హీరో శివరాజ్‌కుమార్ ఇప్పుడు బార్డర్స్ క్రాస్ చేస్తున్నారు. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాలో స్పెషల్ సాంగ్‌లో కనిపించిన శివన్న తమిళ్‌లో రెగ్యులర్‌గా సినిమాలు చేస్తున్నారు.
రీసెంట్‌గా జైలర్ సినిమాలో శివరాజ్ కుమార్ క్యారెక్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తెర మీద కనిపించింది కొద్ది సేపే అయిన శివన్న స్వాగ్‌కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. అందుకే కోలీవుడ్ నుంచి ఈ కన్నడ స్టార్ హీరోకు ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.
Legends In single fame 💥🔥#DrRajkumar #Drshivarajkumar #rajinikanth #Shivanna #Shivarajkumar#Drshivanna #KingShivanna
#Ghost #BhairathiRanagal #KaratakaDamanaka #45TheMovie #Jailer #CaptainMiller #drshivarajkumarupdates pic.twitter.com/KDhPcqjjUk— Dr Shivarajkumar updates ™ (@shivannaupdates) August 21, 2023
ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ కెప్టెన్ మిల్లర్‌లోనూ శివ రాజ్ కుమార్ అతిథి పాత్రలో నటించారు. ఈ సినిమాలో లెంగ్తీ గెస్ట్ రోల్ కోసం 20 రోజుల పాటు ధనుష్‌తో కలిసి షూటింగ్‌లో పాల్గొన్నారు శివ రాజ్ కుమార్.
Thala mudhal adi vara box office – il Jailer alappara! 💥
Mega Blockbuster #Jailer running in theatres near you! #JailerRecordMakingBO@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @Mohanlal @NimmaShivanna @bindasbhidu @tamannaahspeaks @meramyakrishnan @suneeltollywood… pic.twitter.com/Tv9oIczGK9
— Sun Pictures (@sunpictures) August 21, 2023
కోలీవుడ్‌లో వరుసగా టాప్ స్టార్స్‌తో సినిమాలు చేస్తున్న శివరాజ్ కుమార్, ఓ తమిళ హీరోతో కలిసి నటించే ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నా అన్నారు. తల అజిత్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయనతో కలిసి నటించాలనుందన్నారు. అంతేకాదు అజిత్ నటించిన విశ్వాసం లాంటి సినిమాల్లో నటించాలని అలాంటి సబ్జెక్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నా అన్నారు శివరాజ్ కుమార్. మరి అజిత్ కలిసి నటించాలన్న శివన్న కోరిక ఎప్పుడు తీరుతుందో చూడాలి.
Latest Pics Of Handsome Hunk Thala Ajith ❤️#VidaaMuyarchi •• #AjithKumar pic.twitter.com/Z6LEyvZ97s
— AJITHKUMAR FANS CLUB (@ThalaAjith_FC) August 21, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.