
సుప్రీం హీరో, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. త్వరలోనే బ్రో.. ది అవతార్ మూవీతో మన మందుకు రానున్నాడు. ఇందులో పవన్ కల్యాణ్ కూడా నటిస్తున్నారు. కాగా సినిమా విడుదలకు ముందు కడప పెద్ద దర్గాను దర్శించుకున్నాడు సాయి ధరమ్ తేజ్. అక్కడ ప్రత్యేక ప్రార్థనల నిర్వహించిన అనంతరం రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇది నాకు పునర్జన్మ అని , దేవుడే మళ్ళీ పునర్జన్మ ప్రసాదించాడని,
అందుకే ఆలయాలను సందర్శిస్తున్నానని హీరో సాయి ధరమ్ తేజ్ అన్నారు. రాజకీయాలపై అవగాహన ఉంటే రాజకీయ ప్రవేశం చేయాలని పవన్ మామయ్య చెప్పారని అన్నారు. కడప లోని ఫేమస్ పెద్ద దర్గాను దర్శించుకోవడం ఆనవాయితీ అని , మామయ్యతో కలిసి నటించడం మరువలేని అనుభూతిని , ఆయనతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నానని సాయి ధరమ్ తేజ్ ఆనందం వ్యక్తం చేశారు. రాజకీయాలపై అవగాహన ఉంటే రాజకీయ ప్రవేశం చేయాలని పవన్ మామయ్య చెప్పారు.. అయితే నేను నేను సినీ రంగంలోనే ఉంటానని మామయ్యకు చెప్పానన్నారు. మామయ్య పవన్ అంటే నాకు ప్రాణం అని సాయి ధరమ్ తేజ్ స్పష్టం చేశారు .
సముద్ర ఖని దర్శకత్వంలో తెరకెక్కిన బ్రో.. ది అవతార్ జులై 28 న విడుదల కానుంది. తేజ్ సరసన కేతిక శర్మ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్స్ సూపర్ హిట్‌గా నిలిచాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.