Rana : నేను హీరో అవ్వాలంటే నేను కొట్టే విలన్ ఎవరో కనిపించలేదు.. రానా ఇంట్రస్టింగ్ కామెంట్స్

రానా దగ్గుబాటి , సాయి పల్లవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ విరాట పర్వం. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Rana : నేను హీరో అవ్వాలంటే నేను కొట్టే విలన్ ఎవరో కనిపించలేదు.. రానా ఇంట్రస్టింగ్ కామెంట్స్
Rana

Updated on: Jun 12, 2022 | 5:13 PM

రానా(Rana)దగ్గుబాటి , సాయి పల్లవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ విరాట పర్వం. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. డి. సురేష్ బాబు స‌మ‌ర్పణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో రానా మీడియాతో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

రానా మాట్లాడుతూ.. చాలా త్వరగా సినిమాలు చేసేవాడిని. మధ్యలో చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది. ఐతే నేను వచ్చి షూటింగ్ మొదలుపెట్టిన తర్వాత పాండమిక్ వచ్చింది. ఇది సెట్ లో తీసే సినిమా కాదు. పరిస్థితులు సర్దుకున్నాక మళ్ళీ అడవిలోనే షూట్ ఫినిష్ చేశాం. విడుదల తేది విషయానికి వస్తే.. మంచి డేట్ కోసం ఎదురుచూశాం. రెండు మూడు వారాలు మనకే వున్నపుడు వస్తే బావుంటుందని అనుకున్నాం. ఫైనల్ గా జూన్ 17న వస్తున్నాం. దిని తర్వాత రెండు వారాల వరకూ ఎలాంటి సినిమా లేదు. ప్రేక్షకులంతాహాయిగా విరాటపర్వం ఎంజాయ్ చేయొచ్చు అన్నారు.

రవన్న పాత్ర చాలా ఇంటెన్సిటీ వున్న పాత్ర. ఇంత బలమైన పోయిట్రీ రాసే వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళలో ఎంత డెప్త్ వుంటుంది ..దర్శకుడు వేణు గారు నేను చర్చించుకునేవాళ్ళం అన్నారు. అలాగే సాయి పల్లవి గురించి మాట్లాడుతూ.. సాయి పల్లవి గొప్ప నటి. విరాట పర్వంలో వెన్నెల పాత్రలో మరో స్థాయిలో వుంటుంది. ఇక కొన్ని కథలకి కమర్షియల్ టోన్ కావాలి. మరి కొన్ని కథలకు సీరియస్ టోన్ కావాలి. విరాట పర్వం చూసి చప్పట్లు కొడతారో లేదో తెలియదు కానీ .. ఇది నిజమే కదా అని మాత్రం భయపడతారు. అంత నిజాయితీ గల కథ ఇది. విరాట పర్వంకి ఇదే సరైన సమయం. మన ప్రపంచాన్ని వదిలేసి వేరే ప్రపంచంలో నాన్ స్టాప్ గా ఉండగలిగితే అదే సినిమా ఎక్స్ పిరియన్స్. విరాట పర్వం అలాంటి ఎక్స్ పిరియన్స్ వున్న సినిమా. సినిమా చాలా కొత్తగా వుంటుంది. ఒక ప్రేమ కథ రిలాక్స్ గా హ్యాపీ గా వెళ్తుంటుంది. కానీ ఇది భయం భయంగా వెళ్తుంది. ఈ వైవిధ్యం చాలా కొత్తగా వుంటుంది.

ఇవి కూడా చదవండి

నేను హీరో అవ్వాలంటే నేను కొట్టే విలన్ ఎవరో కనిపించలేదు. ఇది మొదటి సమస్య. ఒక కథని చెప్పాలంటే హీరోగానే ఉండాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులకు కొత్తదనం చూపించాలనేది నా కోరిక. ఇప్పుడు నా నుండి రాబోతున్న సినిమాలు హీరోయిజం ఉండేవే. చాలా కొత్తగా వుంటాయి.హిరణ్యకశ్యప చేస్తున్నా. దాని కంటే పెద్ద కమర్షియల్ సినిమా వుండదు. నా వరకూ అది కమర్షియల్. కథ సీరియస్ గా జరుగుతున్నపుడు సడన్ గా డ్యాన్స్ వేస్తె నేను బయటికి వెళ్ళిపోతా. ఇవి నాకు ఎక్కవు. అలాగే హీరోయిన్ ని టీజింగ్ చేసిన ఇబ్బందిగా వుంటుంది. ఇలాంటివి నచ్చవు. మనం టెంపరరీ. సినిమాలు శాశ్వతం. చాలా మంది గొప్ప నటులు వదిలేసిన గొప్ప విషయాలనే గుర్తుపెట్టుకుంటాం. అలా గొప్ప గుర్తుపెట్టుకునే వర్క్ చేయాలని వుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి