AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nikhil Siddhartha: కార్తికేయ3పై క్లారిటీ ఇచ్చిన హీరో నిఖిల్‌.. ఈసారి అంతకు మించి అనేలా..

Karthikeya2 : చాలా కాలం తర్వాత కార్తికేయ2తో సాలిడ్ హిట్‌ అందుకున్నాడు యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ. చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా ఈ మిస్టరీ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకులతో పాటు నార్త్‌ అడియెన్స్‌కు పిచ్చిపిచ్చిగా నచ్చేసింది.

Nikhil Siddhartha: కార్తికేయ3పై క్లారిటీ ఇచ్చిన హీరో నిఖిల్‌.. ఈసారి అంతకు మించి అనేలా..
Karthikeya 2
Basha Shek
|

Updated on: Sep 22, 2022 | 1:10 PM

Share

Karthikeya2 : చాలా కాలం తర్వాత కార్తికేయ2తో సాలిడ్ హిట్‌ అందుకున్నాడు యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ. చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా ఈ మిస్టరీ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకులతో పాటు నార్త్‌ అడియెన్స్‌కు పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. బాక్సాఫీస్‌ వద్ద ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించడంతో హీరో, హీరోయిన్లతో పాటు చిత్రబృందమంతా తెగ సంబరపడిపోతోంది. కాగా రెండు సినిమాలు సూపర్‌ హిట్‌ కావడంతో కార్తికేయ3 కూడా వస్తుందా? లేదా? అన్న ప్రశ్న సినీ ప్రియుల్లో నెలకొంది. ఈ విషయంపై మాట్లాడిన హీరో నిఖిల్‌ కార్తికేయ3 క్లారిటీ ఇచ్చాడు.. ‘కార్తికేయ సినిమా రెండు భాగాలూ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. అందరి దీవెనలు, ఆశీర్వాదాలతో కార్తికేయ3 కూడా తీయనున్నాం. ఈ సినిమా ఎప్పుడు ప్రారంభిస్తామా? ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తామా?అని చాలా ఆత్రుతగా ఉంది. ఎందుకంటే మూడో పార్ట్‌ను 3Dలో రూపొందించనున్నారు’ అని చెప్పకొచ్చాడు నిఖిల్‌.

కాగా శ్రీకృష్ణుని జన్మస్థానమైన ద్వారకలో దాగున్న రహస్యాల నేపథ్యంలో కార్తికేయ2 ను ఆసక్తిగా తీర్చిదిద్దారు చందు మొండేటి. నిఖిల్‌ సరసన అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటించింది. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌, శ్రీనివాసరెడ్డి, సత్య, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు. తక్కువ బడ్జెట్‌తో ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రూ.100 కోట్లకు పైగానే కలెక్ట్‌ చేసినట్లు ట్రేడ్‌ నిపుణులు చెబుతున్నారు. కాగా నిఖిల్ ప్రస్తుతం కేరళలో కార్తికేయ 2 మలయాళ వెర్షన్ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నాడు. అక్కడ సెప్టెంబర్ 23న ఈ సినిమా విడుదల కానుంది.

ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!