Nikhil Siddharth: “అంతా ఒక మిస్టరీలా ఉంది”.. రిలీజ్ డేట్స్ మారడం పై హీరో నిఖిల్ ఆసక్తికర కామెంట్స్..

|

Aug 03, 2022 | 3:54 PM

యంగ్ హీరో నిఖిల్(Nikhil Siddharth) నటించిన కార్తికేయ2 సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో

Nikhil Siddharth: అంతా ఒక మిస్టరీలా ఉంది..  రిలీజ్ డేట్స్ మారడం పై హీరో నిఖిల్ ఆసక్తికర కామెంట్స్..
Nikhil
Follow us on

యంగ్ హీరో నిఖిల్(Nikhil Siddharth) నటించిన కార్తికేయ2 సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో. తన కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచినా కార్తికేయ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ చేస్తున్నాడు నిఖిల్. చందు మొండేటి దర్శకత్వం వహించిన కార్తికేయ సినిమా మిస్టరీ థ్రిల్లర్ గా వచ్చి సూపర్ హిట్ అనుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ అనౌన్స్ చేసిన దగ్గరనుంచి.. సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇక కార్తికేయ 2 సినిమా ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో నిఖిల్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. ఈ క్రమంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు చిత్రయూనిట్.

ఈ సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నిఖిల్ మాట్లాడుతూ..” నేను నటిస్తున్న కార్తీకేయ2 , స్పై చిత్రాలకు సత్తా ఉంది కాబట్టే పాన్ ఇండియా వైడ్ విడుదల చేస్తున్నాము అన్నారు. అలాగే సినిమాల విడుదల డేట్ మారటమనేది ఒక మిస్టరీ అయింది.. రిలీజ్ క్లాష్ లేకుండా ఉండా లనేది నిర్మాతల నిర్ణయం.. అందులో భాగంగా నా సినిమా రిలీజ్ లు మారుతూ వచ్చాయి అన్నారు. ఇక నాకు పార్టీలు ముఖ్యం కాదు, వ్యక్తులే ముఖ్యం.. నేను ఒక నటుడ్ని
నటులకు పార్టీలతో పని లేదు..మంచి ఎవరు చేసినా నటులైన మేము అభినందిస్తాము అని చెప్పుకొచ్చారు నిఖిల్. నిఖిల్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  

ఇవి కూడా చదవండి