AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kartikeya Gummakonda : మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ లో కార్తికేయ.. హీరోయిన్ ఎవరో తెలుసా..

కార్తికేయ గుమ్మకొండ.. ఆర్ఎక్స్ 100 సినిమాతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాడు ఈ యంగ్ హీరో. అయితే ముందుగా ‘ప్రేమతో మీ కార్తిక్’ అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు కార్తికేయ.

Kartikeya Gummakonda : మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ లో కార్తికేయ.. హీరోయిన్ ఎవరో తెలుసా..
Karthikeya
Rajeev Rayala
| Edited By: |

Updated on: Jul 17, 2021 | 9:05 AM

Share

కార్తికేయ గుమ్మకొండ.. ఆర్ఎక్స్ 100 సినిమాతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాడు ఈ యంగ్ హీరో. అయితే ముందుగా ‘ప్రేమతో మీ కార్తిక్’ అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు కార్తికేయ. అయితే ఈ సినిమాతో ఫేమ్ సంపాదించుకోని కార్తికేయ అనంతరం వచ్చిన ‘ఆర్ఎక్స్100’ ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాలో తన అద్భుత నటనతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడీ యంగ్ హీరో. ఇటీవల చావు కబురు చల్లగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ప్రస్తుతం కార్తికేయ హీరోగా ‘రాజా విక్రమార్క’ నిర్మితమవుతోంది. ఈ సినిమాలో ఆయన విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు. కార్తికేయ  పాత్ర స్వరూప స్వభావాలుచాలా కొత్తగా ఉంటాయని తెలుస్తుంది.ఈ  సినిమాలో హీరోయిన్ గా  తాన్య రవిచంద్రన్ అలరించనుంది. అలాగే ఈ సినిమా తోపాటు మరో సినిమాను కూడా పట్టాలెక్కిస్తున్నాడు ఈ కుర్ర హీరో.

ఈ సినిమాలో కార్తికేయ రొమాంటిక్ హీరోగా కనిపించనున్నాడని టాక్. బడా బ్యానర్ యువీ క్రియేషన్స్ భారీ సినిమాలు తీస్తూ వస్తున్నారు. దానికి అనుబంధ సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ ను ఏర్పాటు చేసుకుని ఓ మాదిరి బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్నారు. అలా ఇటీవల వచ్చిన ‘ఏక్ మినీ కథ’ సక్సెస్ అయింది. దాంతో వాళ్లు మరో ప్రాజెక్టును సెట్ చేస్తున్నారు. ఈ సినిమాలో కార్తికేయ హీరో అని తెలుస్తుంది. ప్రశాంత్  అనే నూతన దర్శకుడు ఈ సినిమాతో పరిచయం అవ్వనున్నాడు. ఈ సినిమాలో చిలసౌ ఫేమ్ రుహాని శర్మ ఎంపిక చేశారట చిత్రయూనిట్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Kudi Yedamaithe: కలలో ఏమి జరిగిందో.. ఎగ్జాక్ట్‌‌‌గా అదే జరుగుతోంది.. ఆకట్టుకుంటున్న కుడిఎడమైతే ట్రైలర్..

Anushka Shetty : అనుష్క శెట్టి సినిమా ఆగిపోయిందా.. స్వీటీ మూవీ పై గుసగుసలు.. అసలు విషయం ఏంటంటే

Kim Sharma: టెన్నిస్‌ స్టార్‌ లియాండర్‌ పేస్‌తో కిమ్‌ శర్మ డేటింగ్‌.. వైరల్‌ అవుతోన్న గోవా హాలీడే ఫొటోలు.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్