Gopichand: లక్ష్యం దర్శకుడిపైనే మాచో హీరో ఆశలన్నీ.. హ్యాట్రిక్ హిట్ పక్కా అంటున్న గోపీచంద్..

మాచో హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌లది టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ కాంబినేషన్‌. లక్ష్యం, లౌక్యం వంటి సూపర్ హిట్లను అందించారు.

Gopichand: లక్ష్యం దర్శకుడిపైనే మాచో హీరో ఆశలన్నీ.. హ్యాట్రిక్ హిట్ పక్కా అంటున్న గోపీచంద్..
Gopichand

Updated on: Dec 24, 2021 | 8:33 PM

Gopichand: మాచో హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌లది టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ కాంబినేషన్‌. లక్ష్యం, లౌక్యం వంటి సూపర్ హిట్లను అందించారు. ఇప్పుడు మూడో సారి హ్యాట్రిక్ కొట్టేందుకు ఈ ఇద్దరూ కలిసి ఓ ప్రాజెక్ట్ చేయబోతోన్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రస్తుతం వరుసగా సినిమాలు నిర్మిస్తోంది. ఇప్పుడు ఈ బ్యానర్‌లో గోపీచంద్ మూవీ రాబోతుంది. గోపీచంద్ కెరీర్‌లో 30వ సినిమా రాబోతోన్న ఈ ప్రాజెక్ట్‌ను నేడు లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తపు షాట్‌కు వివి వినాయక్ క్లాప్ కొట్టగా.. టీజీ వెంకటేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మొదటి సన్నివేశానికి దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు గౌరవప్రదంగా దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శ్రీవాస్ మాట్లాడుతూ.. ‘లక్ష్యం, లౌక్యం తరువాత మళ్లీ ఇలా హ్యాట్రిక్ కోసం కలవడం హ్యాపీగా ఉంది. మా మైండ్ సెట్ బాగా సింక్ అవ్వడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్లే ఆ సక్సెస్ వచ్చింది. ఈ సినిమాకు కూడా మంచి కథ కుదిరింది. గురు సమానులైన రాఘవేంద్ర రావు గారు వచ్చి ఫస్ట్ సీన్‌కు డైరెక్ట్ చేయడం ఆనందంగా ఉంది. వినాయక్ వచ్చి క్లాప్ కొట్టడం, టీజీ వెంకటేష్ గారు కెమెరా స్విచ్చాన్ చేయడం హ్యాపీగా ఉంది. ఇలా అందరి మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో వరుసగా చేస్తోన్న మా ఈ చిత్రం ఎంతో ప్రత్యేకంగా మారుతుంది. గోపీచంద్ గారి కెరీర్‌లో 30వ సినిమా అవ్వడంతో మరింత జాగ్రత్తలు తీసుకున్నాం. భూపతి రాజా గారు అందించిన కథ మీద చాలా వర్క్ చేశాం. అందరూ హ్యాట్రిక్ అని అనేవారు. అది బాధ్యతలా మారింది. ఆ రెండు సినిమాలను మించేలా ఇది ఉండబోతోంది. కెమెరామెన్ వెట్రితో లౌక్యం సినిమాను చేశాను. మిక్కీ జే మేయర్ సంగీతం బాగుంటుంది. పండుగ తరువాత మా సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తామని అన్నారు.

గోపీచంద్ మాట్లాడుతూ.. ‘పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో మా హ్యాట్రిక్ సినిమా రాబోతోండటం సంతోషంగా ఉంది. 2007లో లక్ష్యం, ఆ తరువాత ఏడేళ్లకు లౌక్యం. మళ్లీ ఏడేళ్లకు మరో సినిమా చేస్తున్నాం. భూపతి రాజా గారు మంచి కథను అందించారు. వెట్రి గారితో కంటిన్యూగా సినిమాలు చేస్తున్నాను. దాదాపు ఐదు చిత్రాలు ఆయనతో చేశాను. ఆయనతో చేసినప్పుడు పాజిటివ్ వైబ్ ఉంటుంది. మంచి కథకు మంచి ఆర్టిస్ట్‌లు దొరికారు. మంచి టీంతో ముందుకు వెళ్తే ఫలితం కూడా అంతే బాగా వస్తుందని నమ్ముతున్నాను’ అని అన్నారు. వెట్రి పళనిస్వామి కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. భూపతి రాజా కథను అందించగా.. వెలిగొండ శ్రీనివాస్ మాటలు రాశారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shyam Singha Roy Review: స్క్రీన్‌ మీద కలర్‌ఫుల్‌గా శ్యామ్‌ సింగరాయ్‌.. నాని మూవీ రివ్యూ..

Pushpa Movie: అల్లు అర్జున్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. పుష్ప సక్సెస్ మీట్ క్యాన్సిల్.. ఎందుకంటే..

Radhe Shyam: రాధేశ్యామ్ స్టోరీ అదేనంటా ?.. ఇప్పుడిదే నెట్టింట హాట్ టాపిక్..