బాక్సింగ్ వారసత్వం కోసం పోరాటం.. ‘సర్పట్ట పరంబరై’ మూవీ ట్రైలర్…

కోలీవుడ్ హీరో ఆర్య తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.. అల్లు అర్జున్ నటించిన వరుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు ఈ యంగ్ హీరో.

బాక్సింగ్ వారసత్వం కోసం పోరాటం.. సర్పట్ట పరంబరై మూవీ ట్రైలర్...
Arya

Edited By:

Updated on: Jul 14, 2021 | 8:10 AM

కోలీవుడ్ హీరో ఆర్య తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.. అల్లు అర్జున్ నటించిన వరుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు ఈ యంగ్ హీరో. వరుడు సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు. ఆతర్వాత ఆర్య నటించిన చాలా సినిమాలు తెలుగులోనూ విడుదలయ్యాయి. వీటిలో రాజా రాణి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ కుర్ర హీరోకూడా డైరెక్ట్ గా తెలుగులో సినిమా చేయడానికి చూస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఆర్య నటిస్తోన్న ‘సర్పట్ట పరంబరై’ ట్రైలర్ రిలీజ్ చేసారు చిత్రయూనిట్. విలక్షణ దర్శకుడు పా.రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో డిఫరెంట్ గెటప్ లో కనిపించనున్నాడు ఆర్య. మొదటి నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ఆకట్టుకుంటూ వస్తున్న ఆర్య మరోసారి సర్పట్ట పరంబరై సినిమాతో మెప్పించడం ఖాయం అంటున్నారు చిత్రయూనిట్.

ఇక ఈ సినిమా  విషయానికొస్తే.. తెలుగు తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని జూలై 22న ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 1970ల నాటి నార్త్ మద్రాస్ బ్యాక్ డ్రాప్ లో బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. బాక్సింగ్ వారసత్వం కోసం సర్పట్టా – ఇడియప్ప అనే రెండు వంశాల మధ్య నిరంతరం జరిగే పోరాటాన్ని ఈ ట్రైలర్ లో చూపించారు. ఈ సినిమా కోసం ఆర్య చాలా కష్టపడ్డాడు. ఈ సినిమాలో దుషారా విజయన్ హీరోయిన్ గా  నటిస్తుంది. ‘సర్పట్ట’ ట్రైలర్ ను హీరో సూర్య విడుదల చేసి చిత్ర బృందానికి విషెస్ అందించారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Sonu Sood: ముంబైకి వచ్చే ముందు ఫిల్మ్ ఫేర్ పుస్తకం కొన్నా.. 20 ఏళ్ల తర్వాత కల నెరవేరింది అంటున్న సోనూ సూద్

Renu Desai: అతను నా వెనకుంటే.. ఈ ప్రపంచంలో ఏదీ నన్ను బాధించదు. ఆసక్తికర పోస్ట్‌ చేసిన రేణు దేశాయ్‌.