స్టార్‌ హీరో తండ్రి ఆరోగ్యంపై పుకార్లు.. దయచేసి అలాంటివి చేయోద్దంటూ విజ్ఞప్తి

సినిమా సెలబ్రిటీలు కాస్త అనారోగ్యానికి గురైతే చాలు వారి పేరిట సోషల్‌ మీడియాలో పోస్టులు పుంఖానుపుంఖాలుగా దర్శనమిస్తుంటాయి. వీటి వల్ల వారి కుటుంబ సభ్యులు ఎంతో మానసిక క్షోభకు గురవుతుంటారు.

స్టార్‌ హీరో తండ్రి ఆరోగ్యంపై పుకార్లు.. దయచేసి అలాంటివి చేయోద్దంటూ విజ్ఞప్తి
Tollywood

Updated on: Dec 24, 2022 | 11:33 AM

నిజం ఇంటి గడప దాటేలోపే.. అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తుందని తెలుగులో ఒక సామెత ఉంది. దీనికి తగ్గట్లే ఇటీవల సెలబ్రిటీల ఆరోగ్యం విషయంలో పుకార్లు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా సినిమా తారల విషయంలో వదంతులు వేగంగా వ్యాపిస్తున్నాయి. సినిమా సెలబ్రిటీలు కాస్త అనారోగ్యానికి గురైతే చాలు వారి పేరిట సోషల్‌ మీడియాలో పోస్టులు పుంఖానుపుంఖాలుగా దర్శనమిస్తుంటాయి. వీటి వల్ల వారి కుటుంబ సభ్యులు ఎంతో మానసిక క్షోభకు గురవుతుంటారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు హీరో అరుణ్‌ విజయ్‌. తన తండ్రి అలనాటి నటుడు విజయ్‌కుమార్‌ ఆరోగ్యం విషయంలో నెట్టింట్లో వస్తోన్న వార్తలపై ఆవేదన వ్యక్తం చేశాడీ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌. తన తండ్రి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని, దయచేసి వదంతులను ప్రచారం చేయొద్దని కోరుతున్నాడు. కాగా ఎంజీఆర్, శివాజీ గణేషన్‌ల కాలంలో హీరోగా, ఆతర్వాత విలన్‌గా నటించి దక్షిణాది సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్‌కుమార్. తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో వందలాది సినిమాలు చేసిన ఆయన ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు.

ఇక విజయ్‌కుమార్‌ బాటలోనే పయనిస్తున్నాడు ఆయన కుమారుడు అరుణ్‌ విజయ్‌. బ్రూస్‌లీ సినిమాలో విలన్‌గా ఆకట్టుకున్న అతను ప్రభాస్‌ నటించిన సాహోలో కీలక పాత్రలో నటించాడు. ఆతర్వాత హీరోగా పలు సూపర్‌హిట్‌ సినిమాల్లో నటించాడు. ముఖ్యంగా తడమ్‌ (తెలుగులో రెడ్‌) సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల అతను నటించిన యానై, సినమ్‌ సినిమాలు కూడా మంచి విజయాలు సాధించాయి. అదే విధంగా అరుణ్‌ నటించిన తమిళ రాకర్స్‌ అనే వెబ్‌సిరీస్‌ కూడా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతూ ప్రశంసలు అందుకుంటోంది.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..