Kapatadhaari Movie : `సుబ్రహ్మణ్యపురం`,`ఇదంజగత్` చిత్రాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్న కథానాయకుడు సుమంత్ లేటెస్ట్ మూవీ `కపటధారి`. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో క్రియేటివ్ ఎంటర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని డా.ధనంజయన్ నిర్మించారు. ఫిబ్రవరి 19న సినిమా విడుదలైంది. తాజాగా ఈ సినిమా గురించిహీరో సుమంత్మాట్లాడుతూ .. ఆసక్తికరవిషయాలు వెల్లడించారు.
“మళ్లీరావా.. సినిమా హిట్ అయిన తర్వాత నాకు రొమాంటిక్ డ్రామా సినిమాలే ఎక్కువగా వస్తాయని అనుకున్నాను. కానీ ఎక్కువగా థ్రిల్లర్ సినిమాలే వచ్చాయి. ఆడియెన్‌గా నాకు కూడా థ్రిల్లర్ సినిమాలే ఎక్కువగా నచ్చుతాయి. అందుకనే ఏమో రీసెంట్ టైమ్‌లో ఎక్కువగా థ్రిల్లర్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాను. ‘కపటధారి’ విషయానికి వస్తే.. నేను చేసిన థ్రిల్లర్స్ కంటే ఇది చాలా డిఫరెంట్ మూవీ ‘కపటధారి’. సినిమాలో ఓ డిఫరెంట్ మూడ్ క్యారీ అవుతుంది. కన్నడ సినిమా ‘కావలుధారి’ చూశాను. సాధారణంగా మన సినిమాల్లో పోలీసులను హీరోలుగా చూసుంటాం. అయితే ట్రాఫిక్ పోలీసుల గురించి పెద్దగా ఆలోచించం. కానీ జీవితంలో ఏదో సాధించాలనుకునే ఓ ట్రాఫిక్ ఎస్సై కథే ఈ ‘కపటధారి’. ట్రైలర్ చూసుంటే మీకు కథేంటో కాస్త అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. ఎప్పుడో నలబై ఏళ్ల క్రితం మూసేసి పక్కన పడేసిన కేసుకు సంబంధించిన ఆధారాలు దొరికినప్పుడు దీంట్లో ఎక్కడో తేడా జరిగిందే అనే సందేహం హీరోకి వస్తుంది. అతని పొజిషన్‌లో పెద్ద వాళ్లైన ఆఫీసర్స్ వద్దని చెప్పినా కూడా వినకుండా కేసుని సాల్వ్ చేయడానికి హీరో ప్రయత్నించడమే సినిమా ప్రధాన కథాంశం. అయితే స్క్రీన్‌ప్లే డిఫరెంట్‌గా ఉంటుంది. ఎక్కడా సినిమా ఎక్కువగా డివీయేట్ కాదు. సాంగ్స్, కామెడీ, యాక్షన్ అన్నీ ఓ పరిమిత అవధుల్లో ఉంటాయి. సినిమా ఫోకస్డ్‌గా ఉంటుంది. కపటదారి తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉందని సుమంత్ చెప్పుకొచ్చారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
Isaac Thomas Kottukapally : సినీ పరిశ్రమలో విషాదం.. గుండెపోటుతో ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత..
‘Pogaru’ Movie Review : మాస్ ఆడియన్స్ ఆకలి తీర్చే యాక్షన్ ఎంటర్టైనర్ గా ‘పొగరు’..