స్టార్ హీరోయిన్ గొప్ప మ‌న‌సు..కరోనా హెల్ప్‌లైన్ సెంటర్‌లో ప‌నిచేస్తూ ప్ర‌జ‌ల‌కు సేవ‌..

దేశంలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో కేంద్రం ప్ర‌భుత్వం మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించింది. ఈ కారణంగా పేదలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్ప‌టికే పలు స‌హాయ‌క చ‌ర్య‌లు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, సెలబ్రిటీలు కూడా ప్రజలకు వివిధ రూపాల్లో సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. తాజాగా మలయాళ నటి నిఖిలా విమల్ త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది. లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు ప‌డుతోన్న ప్ర‌జ‌ల […]

  • Ram Naramaneni
  • Publish Date - 9:40 am, Wed, 15 April 20
స్టార్ హీరోయిన్ గొప్ప మ‌న‌సు..కరోనా హెల్ప్‌లైన్ సెంటర్‌లో ప‌నిచేస్తూ ప్ర‌జ‌ల‌కు సేవ‌..

దేశంలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో కేంద్రం ప్ర‌భుత్వం మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించింది. ఈ కారణంగా పేదలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్ప‌టికే పలు స‌హాయ‌క చ‌ర్య‌లు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, సెలబ్రిటీలు కూడా ప్రజలకు వివిధ రూపాల్లో సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. తాజాగా మలయాళ నటి నిఖిలా విమల్ త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది. లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు ప‌డుతోన్న ప్ర‌జ‌ల కోసం నిత్యావసరాలు, మెడిసిన్ అందించ‌డం కోసం కేరళ ప్రభుత్వం కేరళలోని కన్నూర్ జిల్లాలో ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఆ కాల్ సెంటర్‌లో పనిచేస్తూ హీరోయిన్ నిఖిల్ విమల్ ..ఆపదలో ఉన్న వారికి ఈ వేదిక‌గా హెల్ప్ చేస్తోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వ‌ర‌కు ఆమె ఈ కాల్ సెంట‌ర్ లో ప‌నిచేస్తోంది. ప్రజా సేవలో ప‌లువురు ప్ర‌ముఖులు కూడా భాగ‌స్వామ్యం అవ్వాల‌నే సందేశం ఇవ్వాల‌నే ఉద్దేశ్యంతో ఈ కాల్ సెంటర్‌లో పనిచేస్తున్నట్టు నిఖిల పేర్కొంది.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు సేవ చెయ్య‌డం ఎంతో ఆనందంగా ఉంద‌ని నిఖిల్ విమల్ ప్రకటించింది. ఈమె తెలుగులో అల్లరి నరేష్ హీరోగా నటించిన స‌మేడ మీద అబ్బాయి మూవీలో హీరోయిన్ గా నటించింది. త‌మిళం, మ‌ళ‌యాళం భాష‌ల్లో ప‌లు సూప‌ర్ హిట్ చిత్రాల్లో న‌టించింది.