
సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక డిమాండ్ ఉన్న సీనియర్ హీరోయిన్లలో రమ్యకృష్ణ ఒకరు. ఒకప్పుడు అగ్ర కథానాయికగా చక్రం తిప్పిన ఆమె.. ఇప్పటికీ చేతినిండా అవకాశాలతో దూసుకుపోతుంది. అందం, నటన, డ్యాన్స్ ఇలా మూడింటిలోనూ రాణిస్తుంది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే లేడీ విలన్ గా.. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఇప్పటికీ ఆమె పోషించిన నీలాంబరి పాత్రకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. నరసింహ సినిమాలో ఏకంగా రజినీకాంత్ నే డామినేట్ చేసింది. దశాబ్దాలుగా సినిమా ప్రపంచంలో కొనసాగుతున్న ఆమె.. ఇప్పటివరకు వైవిధ్యమైన పాత్రలతో అద్భుతమైన నటనతో కట్టిపడేస్తుంది. హీరోయిన్ గా ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేసింది. బాహుబలి సినిమా తర్వాత రమ్యకృష్ణ క్రేజ్ మారిపోయింది. ఆమెకు తెలుగు, తమిళం భాషలలో వరుస అవకాశాలు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..
కంటెంట్ పాత్ర ప్రాధాన్యత నచ్చితే ఎలాంటి రిస్క్ అయిన చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఇప్పటికీ అద్భుతమైన నటనతో కట్టిపడేస్తుంది.. అయితే సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితం గురించి అంతగా బయటపెట్టదు. రమ్యకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే డైరెక్టర్ కృష్ణవంశీని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి రిత్విక్ అనే కుమారుడు ఉన్నారు.
ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..
సోషల్ మీడియాలో రిత్విక్ వంశీ సుపరిచితుడే. అటు కృష్ణవంశీ, ఇటు రమ్యకృష్ణ ఇద్దరూ తమ కెరీర్ లో బిజీగా ఉండగా.. రిత్విక్ మాత్రం బయట అంతగా కనిపించడు. అయితే ఇటీవల తన తల్లితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇప్పుడు రమ్యకృష్ణ తన కొడుకుతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో రిత్విక్ లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.
Ramya Krishna Son
ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‌కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..