Telugu Actress: అమ్మాయిల డ్రీమ్ బాయ్.. అబ్బాస్ కూతురిని చూస్తే షాకే.. సినిమాలకు దూరంగా ఏం చేస్తుందో తెలుసా.. ?

సౌత్ ఇండియాలోనే లవర్ బాయ్. దక్షిణాదిలో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ కెరీర్ పీక్స్ లో ఉండగానే సినిమాలకు దూరమయ్యాడు. మొదటి సినిమాతోనే హీరోగా సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న అబ్బాస్.. ఇప్పుడు మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆయన కూతురు ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

Telugu Actress: అమ్మాయిల డ్రీమ్ బాయ్.. అబ్బాస్ కూతురిని చూస్తే షాకే.. సినిమాలకు దూరంగా ఏం చేస్తుందో తెలుసా.. ?
Abbas

Updated on: Jun 20, 2025 | 9:02 PM

అబ్బాస్.. 90’s యూత్ ఫేవరేట్ హీరో. ముఖ్యంగా అమ్మాయిల కలల రాకుమారుడు. అప్పట్లో ప్రేమకథ సినిమాలతో అడియన్స్ హృదయాలను గెలుచుకున్నాడు. అంతేకాదు.. ఒకప్పుడు అబ్బాస్ హెయిర్ స్టైల్ అంటే అదొక ట్రెండ్. కుర్రాళ్లు ఆ హెయిర్ స్టైల్ తెగ ఫాలో అయ్యేవారు. ఇక అమ్మాయిలకు ఇష్టమైన లవర్ బాయ్. హీరో అబ్బాస్.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. 1996లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ప్రేమదేశం సినిమాతో హీరోగా వెండితెరకు పరిచమయ్యాడు. ఇందులో అతడితోపాటు వినీత్, టబు సైతం ప్రధాన పాత్రలు పోషించారు. మొదటి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తమిళంతోపాటు తెలుగులోనూ ఓ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వత హీరోగా పలు సినిమాల్లో నటించాడు. కానీ అంతగా హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. కెరీర్ పీక్స్ లో ఉండగానే సైడ్ రోల్స్ పోషించారు. అలాగే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటించాడు.

ఆ తర్వాత నెమ్మదిగా అబ్బాస్ ఇమేజ్ తగ్గిపోయింది. దీంతో అతడికి ఇండస్ట్రీలో అవకాశాలు సైతం దూరమయ్యాయి. అబ్బాస్ చివరగా 2009లో వచ్చిన బ్యాంక్ అనే సినిమాలో కనిపించాడు. తెలుగు, తమిళం భాషలలో దాదాపు 50కి పైగ సినిమాల్లో నటించిన అబ్బాస్.. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమై కేవలం యాడ్స్ మాత్రమే చేశారు. ప్రస్తుతం అబ్బాస్ తన ఫ్యామిలీతో కలిసి న్యూజిలాండ్ లో సెటిల్ అయ్యారు. ప్రస్తుతం అక్కడే సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే ఇండియాకు వచ్చిన అబ్బాస్ ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ సైతం ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అబ్బాస్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ క్రమంలో తాజాగా అబ్బాస్ కూతురి ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. అబ్బాస్ 1997లో ఏరూమ్ అని అనే మహిళను వివాహం చేసుకున్నారు. వీరికి కూతురు ఏమిరా అలి, కొడుకు అయమాన్ ఉన్నారు. తాజాగా అబ్బాస్ ఫ్యామిలీ ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా అబ్బాస్ కూతురు హీరోయిన్స్ మించిన అందంతో కట్టిపడేస్తుంది.

Abbas Fam

ఇవి కూడా చదవండి :  

వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..

సీరియల్లో పద్దతిగా.. వెకేషన్‏లో గ్లామర్‏గా.. రుద్రాణి అత్త అరాచకమే..

త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..

Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..