
సూపర్ స్టార్ మహేష్ బాబు మాస్ మసాలా ఎంటర్టైనర్ తో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యారు. మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో అదిరిపోయే కథతో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు గుంటూరు కారం అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ టైటిల్, మహేష్ బాబు లుక్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. వరుసగా విజయాలను అందుకుంటూ దూసుకుపోతూ.. టాప్ హీరోగా రాణిస్తున్నారు మహేష్. ఇక గుంటూరు కారం సినిమా టైటిల్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. కేవలం 24గంటల్లోనే ఈ మూవీ గ్లింమ్స్ రికార్డు స్థాయిలో 25 మిలియన్ వ్యూస్ ను రాబట్టింది.
దాదాపు 12 ఏళ్ల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మరో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుంది. ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్.
ఇక ఈ సినిమాలో మహేష్ తో పాటు మరో నటుడు కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన గ్లింమ్స్ లో త్రివిక్రమ్ ఆయనను చూపించి చూపించినట్టు చూపించారు. ఇంతకు ఆ వీడియోలో కనిపిస్తున్న నటుడు ఎవరో గుర్తుపట్టారా..? ఆయన మరెవరో కాదు. జగపతి బాబు. గుంటూరు కారం సినిమాలో జగపతిబాబు పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ వీడియోలో మహేష్ బాబు హైలైట్ గా కనిపించారు, మరి మహేష్ తో పాటు ఉన్న నటుడు జగపతి బాబే అంటున్నారు ఆడియన్స్. మరి ఈ వీడియోలో కనిపించి కనిపించకుండా ఉన్నది ఆయనేనా.?