సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న నయా మూవీ గుంటూరు కారం. ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సూర్య దేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలో నాగవంశీ ఈ సినిమా గురించి చేసిన కామెంట్స్ సినిమా పై అంచనాలను మరింతగా పెంచేశాయి. సంక్రాంతి కానుకగా గుంటూరు కారం సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ పై భారీ బజ్ క్రియేట్ అవ్వడంతో.. సినిమా నుంచి అప్డేట్స్ ఎప్పుడు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు. త్వరలోనే గుంటూరు కారం మూవీ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు గుంటూరు కారం మొదటి సాంగ్ అంటూ ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గుంటురు కారం సాంగ్ లీక్ అంటూ నెట్టింట రచ్చ జరుగుతోంది. సినిమా అప్డేట్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న అభిమానులు ఈ లీక్ అయినా సాంగ్ ను తెగ వైరల్ చేస్తున్నారు. గుంటూరు కారం సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సాంగ్ అంతగా ఎక్కడం లేదు ఫ్యాన్స్ కు..
మహేష్ బాబు నటించిన దూకుడు, ఆగడు, ‘బిజినెస్‌మేన్’ , సర్కారు వారిపాట సినిమాలకు థమన్ సంగీతం అందించాడు. ఇప్పుడు గుంటూరు కారం సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఇప్పుడు లీక్ అయిన సాంగ్ పై ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నాడు. కొంతమంది సాంగ్ బాగుంది అంటుంటే మరికొంతమంది రాడ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. థమన్ ఎప్పటిలానే పాత మ్యూజిక్ కొట్టాడు అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది ఇది ఒరిజినల్ సాంగ్ కాదు అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఇది ఒరిజినలా కాదా అన్నది తెలియాల్సి ఉంది. గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమాలో మరో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తుంది. వచ్చే ఏడాది జనవరి 12న సినిమాను రిలీజ్ చేయండనికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.