AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంపర్ ఆఫర్ మిస్ చేసుకున్న బ్యూటీ..! మెగాస్టార్ సినిమా నుంచి ఆ అమ్మడు తప్పుకుందా.?

చిరంజీవి వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నారు. ఇటీవలే మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిరంజీవి.. ఇప్పుడు దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి ఒక భారీ ప్రాజెక్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

బంపర్ ఆఫర్ మిస్ చేసుకున్న బ్యూటీ..! మెగాస్టార్ సినిమా నుంచి ఆ అమ్మడు తప్పుకుందా.?
Chiranjeevi
Rajeev Rayala
|

Updated on: Jun 06, 2026 | 3:19 PM

Share

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మాస్ ప్రేక్షకులను కట్టిపడేసే కథతో తెరకెక్కిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక ఇప్పుడు దర్శకుడు బాబీతో సినిమా చేస్తున్నారు మెగాస్టార్. గతంలో బాబీ, చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.. ఇక ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. ఇటీవలే ఈ సినిమా పూజ కార్యాక్రమాలు జరిగాయి. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది.

ఇక ఈ సినిమా నుంచి త్వరలోనే క్రేజీ అప్డేట్స్ రానున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో నటించే నటీనటుల గురించి ఆసక్తికర వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీలో మెగాస్టార్ కూతురిగా అనశ్వర రాజన్ నటిస్తుందని అంటున్నారు. ఇటీవలే ఛాంపియన్ సినిమాతో హిట్ అందుకుంది అనశ్వర రాజన్. అలాగే మరో కీలక పాత్రలో మలయాళ ముద్దుగుమ్మ హనీ రోజ్ నటిస్తుందని టాక్ వినిపిస్తుంది.

గతంలో బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాలో కీలక పాత్రలో నటించింది హనీరోజ్. వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య తల్లి పాత్రతో పాటు భార్యగానూ నటించింది ఈ ముద్దుగుమ్మ. వీరసింహారెడ్డి సినిమాతో మంచి విజయం సాధించినప్పటికీ హనీరోజ్ కు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఇక ఇప్పుడు బాబీ , మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ అందుకుందని టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి ఆమె తప్పుకుందని తెలుస్తుంది. కాగా బాబీ, మెగాస్టార్ సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పటికీ హనీ రోజ్ ఎక్కడ కనిపించలేదు. పైగా హనీ రోజ్ హైదరాబాద్ కూడా రాలేదు. దాంతో ఆమె బాబీ , చిరంజీవి సినిమా నుంచి తప్పుకుందని ప్రచారం జోరందుకుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

View this post on Instagram

A post shared by Honey Rose (@honeyroseinsta)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us