Happy Birthday Vijay Devarakonda: మనీ కోసం అప్పుడు ఎన్నో కష్టాలు.. ఇప్పుడు దునియాను ఏలుతోన్న స్టార్ హీరో

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో వెండి తెరపై చిన్న క్యారెక్టర్ తో అడుగు పెట్టిన విజయ్ దేవరకొండ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో క్యారెక్టర్ తో పేరు తెచ్చుకున్నాడు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా అడుగుపెట్టి.. హీరోగా మొదటి హిట్ అందుకోవడమే కాదు.. ఈ సినిమా నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ను అందుకుంది.

Happy Birthday Vijay Devarakonda: మనీ కోసం అప్పుడు ఎన్నో కష్టాలు.. ఇప్పుడు దునియాను ఏలుతోన్న స్టార్ హీరో
Happy Birthday Vijaya devarakonda

Updated on: May 09, 2023 | 10:15 AM

విజయ్ దేవరకొండ వెండి తెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా అడుగు పెట్టి.. కాలక్రమంలో నటుడిగా హీరోగా టాలీవుడ్ లో అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఈ రోజు విజయ్ దేవరకొండ తన 34వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన గతం గురించి కేవలం రూ. 10 వేల సంపాదన కోసం ఎన్ని రకాలుగా కష్టపడ్డాడో గుర్తుచేసుకున్నాడు.

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో వెండి తెరపై చిన్న క్యారెక్టర్ తో అడుగు పెట్టిన విజయ్ దేవరకొండ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో క్యారెక్టర్ తో పేరు తెచ్చుకున్నాడు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా అడుగుపెట్టి.. హీరోగా మొదటి హిట్ అందుకోవడమే కాదు.. ఈ సినిమా నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ను అందుకుంది. ఇక 2017లో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కాసారిగా స్టార్ డమ్ ను సొంతం చేసుకున్నాడు. తన నటనతో ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నాడు.

వరస విజయాలతో టాలీవుడ్ లో యంగ్ హీరోగా స్టార్ హోదాను సొంతం చేసుకున్న విజయ్ దేవర కొండ డబ్బుల కోసం చిన్న చిన్న పనులు చేశాడు. చిన్న చిన్న ప్రదర్శనలు ఇచ్చాడు.. పదివేల రూపాయల కోసం ఎంతో కష్టపడినట్లు గుర్తు చేశాడు. అంతేకాదు ఇల్లు కొనుకోవాలనుకున్నప్పుడు.. ఒక మ్యూజిక్ ఆల్బమ్ లో నటించాడు. అవసరం తీరడం కోసం ఏ పని అయినా ఏ చిన్న క్యారెక్టర్ అయినా సరే ఒకే అని తనకు సరైన అవకాశం వచ్చే వరకూ వేచి చూశాడు విజయ్ దేవర కొండ. అయితే ఇప్పుడు తనకు డబ్బు నన్ను ఉత్తేజాన్ని ఇవ్వదని పేర్కొన్నాడు. ఎందుకంటే తాను చేస్తున్న పనికి తగిన పారితోషకం ఇస్తున్నారు. తనకు తన అర్హత ఏమిటో తెలుసన్నాడు. అందుకనే తనకు డబ్బులు ఇస్తేనే పని చేస్తానని.. అదే సమయంలో తనకు నచ్చని పనిని ఎంత డబ్బులు ఇచ్చినా చేయనంటూ స్పష్టం చేశాడు అర్జున్ రెడ్డి.

ఇవి కూడా చదవండి

విజయ్ దేవర కొండ, సమత జోడీగా నటించిన ఖుషి మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. మరోవైపు విజయ దేవరకొండ, శ్రీలీల జంటగా కలిసి నటిస్తున్న  VD 12  సినిమా ఇటీవల పూజాదికార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి హెల్మ్  తెరకెక్కించనున్నారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..