Actor Sai Kumar: సీనియర్ యాక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, వ్యాఖ్యాత సాయికుమార్ పుట్టిన రోజు నేడు..

|

Jul 27, 2021 | 7:46 AM

Happy Birthday Sai Kumar: తెలుగు సినిమా నటుడు, డబ్బింగ్ కళాకారుడు, భారతీయ జనతా పార్టీ సభ్యుడు సాయికుమార్ పుట్టిన రోజు నేడు. రెండో రెండు రోజుల క్రితం షష్టి పూర్తి..

Actor Sai Kumar: సీనియర్ యాక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, వ్యాఖ్యాత సాయికుమార్ పుట్టిన రోజు నేడు..
Sai Kumar
Follow us on

Happy Birthday Sai Kumar: తెలుగు సినిమా నటుడు, డబ్బింగ్ కళాకారుడు, భారతీయ జనతా పార్టీ సభ్యుడు సాయికుమార్ పుట్టిన రోజు నేడు. రెండో రెండు రోజుల క్రితం షష్టి పూర్తి వేడుకలను జరుపుతున్న సాయి కుమార్ నేడు తన 61 వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సాయికుమార్ కుటుంబ సభ్యులంతా చిత్రపరిశ్రమతో అనుబంధం ఉన్నవవారే కావడం విశేషం. సాయికుమార్ తండ్రి పి. జె. శర్మ నటుడు, డబ్బింగ్ కళాకారుడు.. ఇక ఇద్దరు తమ్ముళ్ళు అయ్యప్ప శర్మ, రవిశంకర్ నటులు, డబ్బింగ్ ఆర్టిస్టులు సాయికుమార్ తనయుడు ఆది కూడా హీరోగా తెలుగు తెరపై అడుగు పెట్టాడు.

సాయికుమార్‌ నటుడు పి.జె.శర్మ , కృష్ణ జ్యోతి దంపతులకు మొదటి కుమారుడు.. జూలై 27, 1960న చెన్నై లో జన్మించాడు. అక్కడే పెరిగాడు.. తండ్రి పిజె శర్మ డబ్బింగ్ కళాకారుడు, నటుడు కావడంతో సాయి కుమార్ బాల్యం నుంచే సినీ పరిశ్రమపై అనుబంధం ఏర్పడింది. బాలనటుడు, చిన్నతనం నుంచి డబ్బింగ్ కళాకారుడిగా సాయి కుమార్ ఆకట్టుకున్నాడు. కె విశ్వనాధ్ సప్తపది సినిమాలో ఏకులం నీదంట సాంగ్ లో కనిపించిన చిన్నారి బాలుడు సాయికుమార్.. బాలనటుడిగా దేవుడు చేసిన పెళ్లి ఎం,మూవీలో సాయికుమార్న అంధుడిగా నటించి వావ్ అనిపించాడు..1979 లో వచ్చిన గోరింటాకు సినిమాలో మహానటి సావిత్రి గారి కొడుకు “రాముడు” పాత్ర పోషించారు. గోరింటా పూచింది కొమ్మ లేకుండా అనే పాటలో సాయి కుమార్ కనిపించాడు.

ఇక బాలనటుడి నుంచి ఆర్టిస్టుగా ఛాలెంజ్ సినిమాలో సుహాసిని తమ్ముడిగా అడుగు పెట్టాడు.. ఓ వైపు డబ్బింగ్ చెబుతూనే మరోవైపు వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ.. అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు.. మరోవైపు సుమన్, రాజశేఖర్ ల సినిమాలకు మొదట్లో డబ్బింగ్ చెప్పాడు. కన్నడ చిత్రం అగ్ని తో సాయికుమార్ హీరోగా మారాడు. అనంతరం తెలుగులో పలు అవకాశాలను అందుకున్న సాయికుమార్ ఇప్పుడు విలన్ గా కూడా నటిస్తూ తన నటనపై ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.. అంతేకాదు.. బుల్లితెరపై వ్యాఖ్యాతగా కూడా అలరిస్తున్న సాయి కుమార్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలను చెబుతుంది టీవీ.. డిజిటల్ మీడియా

Also Read: Garuda Electric Cycle: సామాన్యులకు అందుబాటులో ఈ-సైకిల్స్.. కేవలం 10 పైసల ఛార్జీతోనే కిలోమీటరు ప్రయాణించే అవకాశం