Prasanth Varma: హనుమాన్ సినిమా విషయంలో ప్రేక్షకులకు సారీ చెప్పిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ఎందుకంటే..

|

Nov 27, 2022 | 3:37 PM

శనివారం హనుమాన్ టీజర్ కు లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ రావు, దర్శకుడు అట్లీ ఫిదా అయ్యారు. అయితే నెట్టింట్లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుండగా.. ఓ విషయంలో సినీ ప్రియులకు క్షమాపణలు చెప్పారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.

Prasanth Varma: హనుమాన్ సినిమా విషయంలో ప్రేక్షకులకు సారీ చెప్పిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ఎందుకంటే..
Prashanth Varma
Follow us on

తెలుగులో తొలి జాంబీ చిత్రం జాంబీ రెడ్డి‏ని తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నారు క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో సినిమాలను రూపొందించడానికి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌ ని సృష్టించాడు. ఇక ఇప్పుడు యంగ్ ట్యాలెంటెడ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో ఆయన తెరకెక్కిస్తోన్న మరో చిత్రం హను-మాన్. ప్రశాంత్ వర్మ ఇదివరకే తేజ సజ్జ పాత్రను ఒక గ్లింప్స్ ద్వారా పరిచయం చేశారు. ఇది సినీ ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచింది. తర్వాత పోస్టర్ల ద్వారా ఇతర ప్రధాన పాత్రలను పరిచయం చేశారు. ఇక తాజాగా హనుమాన్ టీజర్ తో అద్భుతం సృష్టించాడు. ఇటీవల విడుదలైన ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంటూ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలిచింది. సాధారణ ప్రేక్షకుల నుంచి అగ్రదర్శకుల వరకు ప్రశాంత్ వర్మ టేకింగ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. శనివారం హనుమాన్ టీజర్ కు లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ రావు, దర్శకుడు అట్లీ ఫిదా అయ్యారు. అయితే నెట్టింట్లో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుండగా.. ఓ విషయంలో సినీ ప్రియులకు క్షమాపణలు చెప్పారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.

ఇటీవల టీజర్ లాంచ్ సమయంలో రామాయణాన్ని పురాణం అన్నందుకు క్షమించండి అంటూ సోషల్ మీడియా వేదికగా కోరారు. “నా ప్రసంగంలో పురాణం అనే పదాన్ని ఉపయోగించినందుకు క్షమించండి. రామాయణం మన చరిత్ర” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి

ఇక ఇటీవల విడుదలైన టీజర్ విషయానికి వస్తే.. ఒక అద్భుతమైన జలపాతాన్ని చూపిస్తూ టీజర్ ప్రారంభమైయింది. జలపాతంకు ఆనుకొని చేతిలో గదతో భారీ హనుమాన్ విగ్రహం కూడా దర్శనమిస్తోంది. నేపథ్యంలో శ్రీరామ నామం వినిపించింది. సముద్రం ఒడ్డున అపస్మారక స్థితిలో వున్నట్లుగా తేజ సజ్జా ఎంట్రీ ఇచ్చాడు. అమృత అయ్యర్ భయపడుతూ చూడటం సూర్యగ్రహణం చెడు యొక్క ఆగమనాన్ని సూచిస్తుంది. వినయ్ రాయ్ ‘మ్యాన్ ఆఫ్ డూమ్’ గా భయపెట్టాడు. వరలక్ష్మి శరత్‌కుమార్ కొబ్బరిగెలతో విలన్స్ ని కొట్టే పెళ్లికూతురుగా ఎంట్రీ ఇచ్చింది. హనుమంతు అండర్‌ డాగ్‌ నుంచి సూపర్‌హీరోగా మారడం విజువల్ వండర్ గా వుంది. గద పట్టుకుని, కొండపై నిలబడి, హెలికాప్టర్‌ సమీపిస్తుండగా ఆకాశంలో ఎగురుతూ తన అతీత శక్తులను చూపిస్తూ.. హనుమంతుడు ఆవహించినట్లు కనిపిస్తోంది. హనుమ తపస్సు చేస్తూ, రామ నామం జపిస్తున్న చివరి విజువల్స్ మనసులో నాటుకునేలా వున్నాయి.ప్రశాంత్ వర్మ,అతని టీం మాస్టర్ వర్క్ ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. 121 సెకన్ల టీజర్ విజువల్ వండర్ గా అంజనాద్రి ప్రపంచంలోకి తీసుకెళ్లింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.