గుంటూరు కారం షూటింగ్ అప్‌డేట్స్ కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. ఏ చిన్న మ్యాటర్ తెలిసినా మహా ప్రసాదం అనుకుంటున్నారు. మరి ఈ చిత్ర షూటింగ్ ఎంతవరకు వచ్చింది..? వెకేషన్ నుంచి ఇండియాకు వచ్చిన మహేష్.. షూటింగ్‌లో అడుగు పెట్టేదెప్పుడు..? గురూజీ నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు..? సంక్రాంతికి వచ్చేందుకు టీం చేస్తున్న ప్లానింగ్ ఏంటి..? జులైలో ఫారెన్ వెళ్లిన మహేష్ బాబు.. అక్కడే పుట్టిన రోజు వేడుకలు జరుపుకుని ఇండియాకు వచ్చేసారు. వచ్చీ రాగానే ఆయన నెక్ట్స్ షెడ్యూల్‌పై ఫోకస్ చేసారు. గుంటూరు కారం కొత్త షెడ్యూల్ ఆగస్ట్ 16 నుంచి మొదలయ్యేలా కనిపిస్తుంది. మహేష్ కూడా ఇందులో జాయిన్ కానున్నారు. ఈ సారి ఓ భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు త్రివిక్రమ్. నవంబర్ వరకు నాన్ స్టాప్ షెడ్యూల్స్ చేయాలని చూస్తున్నారు గురూజీ.
గుంటూరు కారం అనుకున్న దానికంటే ఆలస్యమైందని అభిమానులు ఫీలవుతున్న వేళ.. ఏం కాదు.. అనుకున్న టైమ్‌కు వచ్చేస్తామంటూ నమ్మకంగా చెప్తున్నారు మేకర్స్. మొన్న బర్త్ డే పోస్టర్స్‌లోనూ రిలీజ్ డేట్ మరోసారి కన్ఫర్మ్ చేసారు. సంక్రాంతికి మహేష్ మిర్చి ఘాటు చూపించడం ఖాయం అంటున్నారు త్రివిక్రమ్. అతడు, ఖలేజా తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా ఇది.
మహేష్ బాబు ఇన్ స్టా పోస్ట్..
హైదరాబాద్‌లోనే గుంటూరు కారం కోసం రెండు భారీ సెట్స్ వేసారు మేకర్స్. అందులోనే యాక్షన్ సీన్స్‌తో పాటు పలు కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు త్రివిక్రమ్. డిసెంబర్‌లోపు షూటింగ్ పూర్తి చేయాలనేది గురూజీ ప్లాన్. తన హీరోలందరికీ బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన త్రివిక్రమ్.. మహేష్‌కి మాత్రమే బాకీ పడ్డారు. ఆ లోటు గుంటూరు కారంతో తీర్చేస్తానంటున్నారు మాటల మాంత్రికుడు.
మహేష్ బాబు ఇన్ స్టా పోస్ట్..
మహేష్ బాబు ఇన్ స్టా పోస్ట్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.