Tollywood : యూత్‌ను ఊపేసిన సినిమా ఇది.. ఎదో కనిపెట్టండి చూద్దాం.!

|

Sep 17, 2024 | 9:32 PM

సోషల్ మీడియాలో లేదా సండే బుక్స్‌లో వచ్చే సూడోకోలాంటివి సాల్వ్ చేయడానికి జనాలు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అలాగే ఈ క్రమంలోనే సినిమా హీరోయిన్స్‌ను గుర్తుపట్టడం.. సినిమా పేర్లు కనిపెట్టడంలాంటివి చేయడం నెటిజన్స్‌ను ఆకర్షిస్తూ ఉంటాయి.

Tollywood : యూత్‌ను ఊపేసిన సినిమా ఇది.. ఎదో కనిపెట్టండి చూద్దాం.!
Tollywood
Follow us on

చాలా మంది స్ట్రెస్ ఎక్కువైయితే.. పజిల్స్ సాల్వ్ చేస్తుంటారు. మరికొంతమంది సరదా కోసం పజిల్స్ సాల్వ్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో లేదా సండే బుక్స్‌లో వచ్చే సూడోకోలాంటివి సాల్వ్ చేయడానికి జనాలు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అలాగే ఈ క్రమంలోనే సినిమా హీరోయిన్స్‌ను గుర్తుపట్టడం.. సినిమా పేర్లు కనిపెట్టడంలాంటివి చేయడం నెటిజన్స్‌ను ఆకర్షిస్తూ ఉంటాయి. వీటి వల్ల మన సినిమా నాలెడ్జ్ పెరగడమే కాకుండా బ్రెయిన్ కూడా స్ట్రెస్ నుంచి రిలాక్స్ చేస్తుంది. అలాగే అంతో ఇంతో షార్ప్ అవుతుంది. ఇలాంటి పజిల్స్ కు ఇప్పుడు నెట్టింట యమా డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే వైరల్ అవుతున్న ఫోటో మీకోసం.. పైన కనిపిస్తున్న ఎమోజీలా ఆధారంగా మూవీ టైటల్ ను కనిపెట్టండి చూద్దాం..!

ఇది కూడా చదవండి :ఈ అందాల నటి గుర్తుందా.? ఒకప్పుడు కుర్రాళ్ళ ఫెవరెట్ ఆమె.. ఇప్పుడు ఎలా ఉందంటే

ఆది మన తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమా.. ప్రేక్షకులను ముఖ్యంగా యువతను వివరీతంగా ఆకట్టుకుంది. ఇంతకు ఆ సినిమా ఏదంటే.. పై ఫొటోలో ఉన్న సినిమా పేరు అర్జున్ రెడ్డి. ఓవర్ నైట్ లో హీరోలకు స్టార్ డమ్ తెచ్చే సినిమాలు కొన్నుంటాయి. వాటిలో ఈ సినిమా ఒకటి. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ గా మారిపోయాడు. విజయ్ క్రేజ్ ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇది కూడా చదవండి : చూస్తే బిత్తరపోవాల్సిందే..! దేవిపుత్రుడు చైల్డ్ ఆర్టిస్ట్ ఎంత మారిపోయింది..!

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో విజయ్ నటన అలాగే యాటిట్యూడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే షాలిని పాండే హీరోయిన్‌గా తన అందచందాలతో కట్టిపడేసింది. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ స్టార్ హీరోగా మారిపోయాడు. వరుస సినిమాలుతో దూసుకుపోతున్నాడు. అయితే షాలిని పాండే మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది. ప్రస్తుతం విజయ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ మధ్య విజయ్ నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయి.

ఇది కూడా చదవండి : చూస్తే బిత్తరపోవాల్సిందే..! దేవిపుత్రుడు చైల్డ్ ఆర్టిస్ట్ ఎంత మారిపోయింది..!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.