Tollywood: లాఠీ పట్టిన ఈ కుర్రాడు ఇప్పుడు రొమాంటిక్ హీరో.. స్టార్ హీరోయిన్లతో డేటింగ్.. 40 ప్లస్‌లోనూ సింగిలే

చాలా మంది హీరోలకు అమ్మాయిల ఫాలోయింగ్ ఉంటుంది. అయితే ఈ రొమాంటిక్ హీరోకు మాత్రం స్టార్ హీరోయిన్లు పడిపోతారని సినిమా ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఈ హీరోతో ఒకసారి కలిసి నటిస్తే చాలు.. ఆ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడన్న రూమర్లు ఇట్టే వైరలవుతాయి.

Tollywood: లాఠీ పట్టిన ఈ కుర్రాడు ఇప్పుడు రొమాంటిక్ హీరో.. స్టార్ హీరోయిన్లతో డేటింగ్.. 40 ప్లస్‌లోనూ సింగిలే
Tollywood Actor

Updated on: Oct 09, 2025 | 7:23 PM

పై ఫొటోలో పోలీస్ గెటప్ లో కనిపిస్తోన్న కుర్రాడిని గుర్తు పట్టారా? ఈ పిల్లాడు స్టార్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కుమారుడు. ఇప్పుడు సౌతిండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో. తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తూ ఛైల్డ్ ఆర్టిస్టుగా చాలా సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత హీరోగానూ ఎంట్రీఇ చ్చాడు. కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా యూత్ ఫుల్ లవ్ స్టోరీ సినిమాలే చేశాడు. ఎంతో మంది అమ్మాయిల మనసులు దోచుకున్నాడు. ఇప్పుడు లవ్ తో పాటు యాక్షన్ సినిమాలు కూడా చేస్తూ ఆడియెన్స్ ను అలరిస్తున్నాడు. ఈ హీరో మంచి నటుడే కాదు ట్యాలెంటెడ్ సింగర్ కూడా. పలువురి తెలుగు హీరోల సినిమాల్లో పాటలు పాడి అలరించాడు. సినిమాల సంగతి పక్కన పెడితే.. సినిమ ఇండస్ట్రీలో ఇతనికి రొమాంటిక్ హీరోగా పేరుంది. చాలా మంది స్టార్ హీరోయిన్లతో ప్రేమ వ్యవహారాలు నడిపారన్న రూమర్లు ఉన్నాయి. సిల్వర్‌ స్క్రీన్‌పై లవర్‌ బాయ్‌గా కనిపించిన ఈ హీరోకు రియల్ స్టోరీలోనూ బోలెడు లవ్ స్టోరీలు, బ్రేకప్ లు ఉన్నాయి. నయన తార, త్రిష, హన్సిక, నిధి అగర్వాల్ వంటి స్టార్ హీరోయిన్లతో ఈ హీరో డేటింగ్ చేశాడని పుకార్లు వినిపించాయి. అయితే ఇంత మంది హీరోయిన్లతో డేటింగ్ చేసినా ఈ హీరో ఇప్పటికీ సింగిల్ గానే ఉన్నాడు. ఈపాటికే అర్థమై ఉంటుంది. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో.. యస్. ఆ కుర్రాడు మరెవరో కాదు.. కోలీవుడ్ స్టార్‌ హీరో శింబు.

ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ టి. రాజేందర్‌ వారసుడిగా సినిమాల్లోకి అడుగు పెట్టాడు శింబు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత హీరోగానూ ఎంట్రీ ఇచ్చాడు. తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. ‘మన్మథ’, ‘వల్లభ’ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా దగ్గరైపోయాడీ హ్యాండ్సమ్ హీరో. ఆ మధ్యన వరుసగా పరాజయాలుఎదురైనప్పటికీ ‘మానాడు’, ‘పాతు తలా’ సినిమాలతో మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చాడు.

ఇవి కూడా చదవండి

శింబు ఫొటోస్..

శింబు ఇటీవల నటించిన థగ్ లైఫ్ సినిమా పెద్దగా ఆడలేదు. మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమాలో కమల్ హాసన్ కూడా నటించాడు. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం వెట్రిమారన్ తెరకెక్కిస్తోన్న ఓ సినిమాలో నటిస్తున్నాడు శింబు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.