సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన నిజం సినిమాను అంతా సులభంగా మరిచిపోరు. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మహేష్ బాబు నటన విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఒక్కడు లాంటి మాస్ హిట్ తర్వాత మహేష్ ఎంచుకున్న డిఫరెంట్ స్టోరీ ఇది. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అవ్వకపోయినా పలు అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో తాళ్ళూరి రామేశ్వరి, గోపిచంద్ఎం హీరోయిన్ రాశి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో నటనకు గాను మహేష్ బాబుకు ఉత్తమ నటుడిగా, తాళ్ళూరి రామేశ్వరికి ఉత్తమ సహాయనటిగా నంది పురస్కారం లభించింది. అలాగే ఈ సినిమాను ఒడియాలో అర్జునగా, బంగ్లాదేశ్‌లో టాప్ లీడర్‌గా రీమేక్ చేయబడింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో స్టార్టింగ్ లో చందమామ రావే.. అంటూ సాగే ఒక పాట ఉంటుంది.
టైటిల్ పడే సమయంలో వచ్చే ఈ పాటలో ఒక తల్లి తన బిడ్డకు చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది. ఈ చిన్నారి ఎవరో తెలుసా.. ముద్దులొలుకుతున్న ఆ బాబు మహేష్ కు చాలా కావాల్సిన వాడు. ఆ బుడతడు ఎవరో కాదు మహేష్ బాబు అన్న కొడుకు రమేష్ బాబు తనయుడు జయ కృష్ణ.
ఈ సినిమా తర్వాత మరో సినిమాలో నటించలేదు జయకృష్ణ.. ప్రస్తుతం ఆతడు చదువుల పై దృష్టి పెట్టాడు. ఇటీవల జరిగిన సూపర్ స్టార్ కృష్ణ దశ దిన కర్మ రోజు జయకృష్ణ హాజరయ్యాడు. ఈ కుర్రాడు చాలా స్మార్ట్ గా అచ్చం బాబాయ్ మహేష్ బాబులా ఉన్నాడు. మరి ఈ కుర్రాడు హీరోగా ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి.