ప్రస్తుతం చిత్రపరిశ్రమలో కన్నడ, మలయాళీ ముద్దుగుమ్మ హావా కొనసాగుతుంది. ఇటీవల వచ్చిన కుర్ర హీరోయిన్స్.. అగ్రకథానాయికలకు మధ్య పోటీతత్వం పెరిగింది. అయితే హీరోయిన్ అంటే కేవలం అందం మాత్రమే కాదూ. ఆహార్యం కూడా ముఖ్యమే. పాత్రకు.. సన్నివేశాలకు తగినట్టుగా హావాభావాలు పలికించడమే కాకుండా.. శరీరం కూడా చాలా ఫిట్ గా ఉండాలి. అందుకు హీరోయిన్స్ ఎక్కువగా యోగా, మెడిటేషన్, వర్కవుట్స్ చేస్తుంటారు. జిమ్ లో చెమటలు కక్కుతూ కష్టతమైన వర్కవుట్స్ చేసే ముద్దుగుమ్మలు కొందరు కాగా.. మరికొందరు మాత్రం యోగతో చేస్తుంటారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతుంటాయి. అయితే తాజాగా ఓ కుర్రహీరోయిన్ తన ఒంటిని విల్లులా మార్చేసింది. సన్నజాజి తీగల శరీరాన్ని వంచేసిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో పలు హిట్ చిత్రాల్లో కనిపించింది. ఎవరో గుర్తుపట్టండి.
ఈ ముద్దుగుమ్మ ఎవరంటే.. హీరోయిన్ మాళవిక శర్మ.. న్యాయవాది అయిన ఈ చిన్నది.. తెలుగులో మాస్ మాహారాజా రవితేజ సరసన నేల టికెట్టు సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత రెడ్ చిత్రంలో నటించింది. ఓవైపు న్యాయవాదిగా కొనసాగుతూనే మరోవైపు కథానాయికగా మెప్పిస్తోంది. అలాగే తమిళంలో కాఫీ విత్ కాదల్, హిందీలో కిసీ కా భాయ్ కిసీ కి జాన్ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఎన్నో ఆశలతో తెలుగులో నేలటికెట్టు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకు అంతగా అవకాశాలు రాలేదు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేదు. దీంతో మాళవిక శర్మ తెలుగులో అంతగా ఆఫర్లు అందుకోలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తుంది మాళవిక.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.