17 ఏళ్లకే ప్రేమ, పెళ్లి ఆపై విడాకులు.. ఇప్పుడు స్టార్‌తో పెళ్ళికి రెడీ అయ్యింది.. ఆమె ఎవరో తెలుసా

|

Oct 28, 2024 | 12:50 PM

ఓ హీరోయిన్ చిన్న వయసులోనే ప్రేమ , పెళ్లి, విడాకులు ఇలా అన్నింటిని చూసేసింది. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. అంతే కాదు. ఇటీవలే ఓ హీరోను పెళ్లాడింది ఆ ముద్దుగుమ్మ.

17 ఏళ్లకే ప్రేమ, పెళ్లి ఆపై విడాకులు.. ఇప్పుడు స్టార్‌తో పెళ్ళికి రెడీ అయ్యింది.. ఆమె ఎవరో తెలుసా
Tollywooc Actress
Follow us on

సినీ ఇండస్ట్రీలో కొంతమంది భామలు చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు. పరిస్థితుల ప్రభావమో.. లేక ఫ్యామిలీ కారణాల వల్లో కొంతమంది చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నటారు. ఆతర్వాత భర్తతో విడిపోయి ఆతర్వాత తిరిగి తమ కెరీర్ పై దృష్టి పెట్టి సక్సెస్ అయ్యారు. అలాగే ఓ హీరోయిన్ చిన్న వయసులోనే ప్రేమ , పెళ్లి, విడాకులు ఇలా అన్నింటిని చూసేసింది. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. అంతే కాదు. ఇటీవలే ఓ హీరోను పెళ్లాడింది ఆ ముద్దుగుమ్మ. ఇంతకూ ఆ కొత్త పెళ్లి కూతురు ఎవరో తెలుసా.? కావాల్సినంత అందం.. ఎలాంటి మగాడినైనా ప్రేమలో పడేసే వయ్యారం ఆమె సొంతం. అందం, అభినయం కలబోసిన ఆమె రూపం అబ్బో ఓ అద్భుతం అంతే.. ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టారా.?

ఇది కూడా చదవండి : అప్పట్లో కుర్రాళ్ళ క్రష్.. మొగలిరేకులు హీరోయిన్ గుర్తుందా..! ఇప్పుడు ఎలా ఉందంటే

మాములుగా సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, డేటింగులు, విడిపోవడాలు ఎక్కువగా కనిపిస్తూనే ఉన్నాయి. కొంతమంది పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలు పెడుతుంటే మరికొంతమంది విడాకులు తీసుకొని విడిపోతున్నారు. అయితే ఈ హీరోయిన్ 17 ఏళ్లకే ప్రేమలో పడింది, ఆతర్వాత పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత భర్తతో విడిపోయింది. ఇప్పుడు మరో హీరోను పెళ్లి చేసుకుంది. ఇంతకూ ఆమె ఎవరంటే..

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Soundarya: కోట్లు కురిపించిన అమ్మోరు సినిమాకు సౌందర్య రెమ్యునరేషన్ మరీ అంత తక్కువా..!

పై ఫొటోలో ఉన్న హీరోయిన్ మరెవరో కాదు అందాల భామ అధితి హైదరి. నేడు ఈ భామ పుట్టిన రోజు. అయితే అధితి తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో హీరోయిన్ గా చేసింది. తెలుగులో సమ్మోహనం సినిమాతో పరిచయమైన ఈ భామ. ఆతర్వాత మహాసముద్రం సినిమాతో ఆకట్టుకుంది. ఈ చిన్నది 17 ఏళ్ల వయసులోనే ప్రేమలో పడింది. 17 ఏళ్ల వయసులోనే సత్యదీప్‌ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. తర్వాత 23 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది. కానీ వీరి బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఈ ఇద్దరూ విడిపోయారు. విడిపోయిన తర్వాత అధితి హీరోయిన్ గా తన కెరీర్ లో బిజీ అయ్యింది. ఇక ఇప్పుడు నటుడు సిద్ధార్థ్‌ ను వివాహం చేసుకోనుంది. తెలంగాణ, వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో వీరి నిశిచితార్థం జరిగింది. త్వరలోనే వీరి పెళ్లి జరగనుంది. కాగా సిద్ధార్థ్‌ కూడా ఇది రెండో పెళ్లి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.