ప్రస్తుతం సోషల్ మీడియా క్రేజ్ ఎలా ఉందో తెలిసిందే. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు గంటలు గంటలు నెట్టింట మునిగితేలుతుంటారు. తమ అభిమాన సినీ తారలతో ఇంటర్నెట్ వేదికగా ముచ్చటిస్తున్నారు. తమ హీరోహీరోయిన్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంటున్నారు. అయితే కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో త్రోబ్యాక్ పిక్చర్స్ ట్రెండ్ నడుస్తోంది. అలాగే ఇటీవల హీరోయిన్స్ క్రేజీ ఫోటోస్ కూడా వైరలవుతున్నాయి. ఈక్రమంలో తాజాగా టాలీవుడ్ బ్యూటీ అందమైన ఫోటో నెట్టింటిని షేక్ చేస్తుంది. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టగలరా ?.. పైన ఫోటోలో లగ్జరీ కారు పక్కన యమ స్టైల్ గా నిల్చోన్న ఈ హీరోయిన్ మన టాలీవుడ్ అమ్మాయే. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. అందం, అంతకు మించిన టాలెంట్ ఉన్నప్పటికీ సరైన గుర్తింపు మాత్రం రావట్లేదు. చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తోంది. ఎవరో గుర్తుపట్టండి.
ఆ అమ్మాయి ఎవరంటే.. హీరోయిన్ రీతు వర్మ. 1990 మార్చి 10న హైదరాబాద్‌లో జన్మించింది. అనుకోకుండా షార్ట్ ఫిల్మ్‌లో నటించిన రీతు.ఆ తర్వాత సినీ రంగంలోకి ప్రవేశించింది. ప్రేమ, ఇష్క్ కాదల్ సినిమాతో వెండితెరకు పరిచమయైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత నా రాకుమారుడు.. ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రాల్లో నటించి మెప్పించింది.
విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన పెళ్లి చూపులు సినిమాతో రీతు వర్మ ఫాలోయింగ్ పెరిగిపోయింది. దీంతో రీతుకు ఆఫర్స్ క్యూ కట్టాయి. ఆ తర్వాత టక్ జగదీష్ చిత్రంలో నానికి జోడిగా కనిపించింది. వరుడు కావలెను, ఒకే ఒక జీవితం చిత్రాల్లో చివరిసారిగా కనిపించింది. ఈరోజు రీతు వర్మ పుట్టినరోజు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.