Tollywood: సైనికుడిలాగా ఫోజులిస్తోన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి.. బ్లాక్ బస్టర్ హిట్స్‏తో జోష్ మీదుంది..

సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టినప్పటికీ అందం.. అభినయంతో ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇటీవలే తెలుగులో బ్లాక్ బస్టర్ ఖాతాను అకౌంట్లో వేసుకుంది. ఎవరో గుర్తుపట్టండి. ఆ అమ్మాయి మనందరికీ సుపరిచితమే. ఆమెను తెలుగు అభిమానులు మరో పేరుతో పిలుచుకుంటారు. గుర్తుపట్టారా ? తను మరెవరో కాదు.. హీరోయిన్ కీర్తి సురేష్.

Tollywood: సైనికుడిలాగా ఫోజులిస్తోన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి.. బ్లాక్ బస్టర్ హిట్స్‏తో జోష్ మీదుంది..
Tollywood

Updated on: Apr 08, 2023 | 7:35 PM

పైన ఫోటోలో సైనికుడిలాగా ఫోటోలకు ఫోజులిస్తోన్న ఈ అమ్మాయి.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్. అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకంగా ఫ్యాన్స్ బేస్ క్రియేట్ చేసుకుంది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత నటిగా ప్రశంసలు అందుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాతో అగ్రకథానాయికగా గుర్తింపు సంపాదించుకున్న ఈ చిన్నది.. తెలుగుతోపాటు.. తమిళంలోనూ ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టినప్పటికీ అందం.. అభినయంతో ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇటీవలే తెలుగులో బ్లాక్ బస్టర్ ఖాతాను అకౌంట్లో వేసుకుంది. ఎవరో గుర్తుపట్టండి. ఆ అమ్మాయి మనందరికీ సుపరిచితమే. ఆమెను తెలుగు అభిమానులు మరో పేరుతో పిలుచుకుంటారు. గుర్తుపట్టారా ? తను మరెవరో కాదు.. హీరోయిన్ కీర్తి సురేష్.

నేను శైలజ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన కీర్తి.. ఆ తర్వాత అలనాటి హీరోయిన్ సావిత్రి జీవితకథ ఆధారంగా వచ్చిన మహానటి సినిమాలో నటించి మెప్పించింది. ఇందులో ఏకంగా సావిత్రిని మైమరపించింది. ఈ సినిమాకుగానూ.. ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత తెలుగులో అనేక చిత్రాల్లో నటించింది. గతేడాది సర్కారు వారి పాట సినిమాతో హిట్ అందుకున్న కీర్తి.. తాజాగా దసరా సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. న్యాచురల్ స్టార్ నాని నటించిన ఈ సినిమాలో వెన్నెల పాత్రలో అదరగొట్టింది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్ చిత్రంలో నటిస్తోంది కీర్తి. ఇందులో చిరు చెల్లిగా కనిపించనుంది. తాజాగా దసరా సినిమాకు సంబంధించి ఈ ఇంట్రెస్టింగ్ ఫోటో షేర్ చేస్తూ.. దసరా సెలబ్రెషన్స్ స్టార్ట్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరలవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.