Tollywood: ఆమె కొసరి.. కొసరి చూస్తేనే.. హృదయం పులుపెక్కి పోతుందే.. ఈ టాలీవుడ్ ఎవరో గుర్తుపట్టగలరా..?

తొలి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత సరైన ఆఫర్స్ రాకపోవడంతో మరో సూపర్ హిట్ చిత్రంలో కీలకపాత్రలో కనిపించింది. అందం, అభినయం ఉన్నప్పటికీ ఈ బ్యూటీకి మాత్రం అంతగా అవకాశాలు రాలేదు.

Tollywood: ఆమె కొసరి.. కొసరి చూస్తేనే.. హృదయం పులుపెక్కి పోతుందే.. ఈ టాలీవుడ్ ఎవరో గుర్తుపట్టగలరా..?
Actress

Updated on: Feb 18, 2023 | 11:14 AM

ఫస్ట్ మూవీతోనే టాలీవుడ్ ఆడియన్స్ మనసు దొచుకున్న హీరోయిన్స్ గురించి చెప్పక్కర్లేదు. న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి.. కాజల్ అగర్వాల్.. సమంత.. ఆషికా రంగనాథ్, కృతి శెట్టి తారలు ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక మరికొందరు ఒక్క సినిమా చేసి ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోతారు. సరైన అవకాశాల కోసం ఎదురుచూసే వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. తొలి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత సరైన ఆఫర్స్ రాకపోవడంతో మరో సూపర్ హిట్ చిత్రంలో కీలకపాత్రలో కనిపించింది. అందం, అభినయం ఉన్నప్పటికీ ఈ బ్యూటీకి మాత్రం అంతగా అవకాశాలు రాలేదు.

ఓవైపు సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన పిక్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఎవరో గుర్తుపట్టండి. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ షాలిని పాండే.

ఇవి కూడా చదవండి

2017లో తెలుగులో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన అర్జున్ రెడ్డి సినిమాతో కథానాయికగా అరంగేట్రం చేసింది. 1993 సెప్టెంబర్ 23న మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జన్మించింది. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉన్న ఈ చిన్నది.. అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మహానటి, ఇద్దరి లోకం ఒకటే వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే ఈ ముద్దుగుమ్మకు తెలుగులో మాత్రం అంతగా అవకాశాలు రావడం లేదు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.