Tollywood: ఈ చిన్నోడు ఇప్పుడు స్టార్ హీరో.. లవర్ బాయ్ మాత్రమే కాదు.. మాస్ యాక్షన్ అదరగొట్టేస్తాడు..

పైన ఫోటోలోని చిన్నోడిని చూశారు కదా.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు . అంతేకాకుండా..బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుని ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ క్యూట్ బుజ్జాయి తెలుగు హీరోనే. ఎవరో గుర్తుపట్టండి.

Tollywood: ఈ చిన్నోడు ఇప్పుడు స్టార్ హీరో.. లవర్ బాయ్ మాత్రమే కాదు.. మాస్ యాక్షన్ అదరగొట్టేస్తాడు..
Actor

Edited By:

Updated on: May 18, 2023 | 3:47 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రోబ్యాక్ ట్రెండ్ ఎంతగా హల్చల్ చేస్తుందో చెప్పక్కర్లేదు. సామాన్యులే కాకుండా.. సెలబ్రెటీలు సైతం నెట్టింట తమ చిన్ననాటి జ్ఞాపకాలను షేర్ చేస్తున్నారు.. ఇటీవల టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో ఎంతోమంది స్టార్స్ తమ బాల్యం తాలుకూ ఫోటోస్ అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ క్రేజీ హీరో చైల్డ్ హుడ్ పిక్ నెట్టింట వైరలవుతుంది. పైన ఫోటోలోని చిన్నోడిని చూశారు కదా.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు . అంతేకాకుండా..బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుని ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ క్యూట్ బుజ్జాయి తెలుగు హీరోనే. ఎవరో గుర్తుపట్టండి. ఆ చిన్నోడు మరెవరో కాదు.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.

2006లో దేవదాసు సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు రామ్ పోతినేని. ఇందులో ఇలియానా కథానాయికగా నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాక రామ్ కి ఫిలింఫేర్ సౌత్ – ఉత్తమ నూతన నటుడు అవార్డును అందుకున్నాడు రామ్. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన జగడమే సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇవే కాకుండా.. రెడీ, మస్కా, కందిరీగ, మసాలా, ఒంగోలు గిత్తా వంటి చిత్రాలతో హిట్స్ అందుకున్నాడు. ఆ తర్వాత మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం రామ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రూపోందుతుంది. ఇందులో శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా ముగింపు దశ చిత్రీకరణలో ఉంది. ఇక ఈ సినిమాతోపాటు.. త్వరలోనే మరోసారి పూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఇంకా షూటింగ్ స్టార్ట్ కానీ ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 8న రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ కాసేపటి క్రితం ప్రకటించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.