AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ అక్కాతమ్ముళ్లను గుర్తు పట్టారా? స్టార్ హీరో, హీరోయిన్‌.. ఆ ఫేమస్ నటి కజిన్స్ కూడా

పై ఫొటోలో కనిపిస్తున్న ఆక్కాతమ్ముళ్లు ఎవరో గుర్తు పట్టారా? ఇప్పుడు వీరిద్దరూ ఫేమస్ సినిమా సెలబ్రిటీలు. ఒకరు ఇప్పటికే తన అందం, అభినయంతో సినిమ ఇండస్ట్రీని షేక్ చేసిన అందాల తార. మరొకరు ఇప్పుడిప్పుడే స్టార్ హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చకుంటోన్న ట్యాలెంటెడ్ యాక్టర్. అన్నట్లు ఈ ఇద్దరూ కూడా ఒక దివంగత నటికి కజిన్స్ కూడా అవుతారు.

Tollywood: ఈ అక్కాతమ్ముళ్లను గుర్తు పట్టారా? స్టార్ హీరో, హీరోయిన్‌.. ఆ ఫేమస్ నటి కజిన్స్ కూడా
Actors Childhood Photo
Basha Shek
|

Updated on: Aug 27, 2024 | 5:49 PM

Share

పై ఫొటోలో కనిపిస్తున్న ఆక్కాతమ్ముళ్లు ఎవరో గుర్తు పట్టారా? ఇప్పుడు వీరిద్దరూ ఫేమస్ సినిమా సెలబ్రిటీలు. ఒకరు ఇప్పటికే తన అందం, అభినయంతో సినిమ ఇండస్ట్రీని షేక్ చేసిన అందాల తార. మరొకరు ఇప్పుడిప్పుడే స్టార్ హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చకుంటోన్న ట్యాలెంటెడ్ యాక్టర్. అన్నట్లు ఈ ఇద్దరూ కూడా ఒక దివంగత నటికి కజిన్స్ కూడా అవుతారు. ఇందులో అమ్మాయి విషయానికివస్తే.. తెలుగు సినీ ఆడియెన్స్ కు అభిమాన నటి. తన అందంతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసిన ఒక స్టార్ హీరోయిన్. తెలుగు, తమిళ చిత్రాల్లోనూ మెరిసిన ఈ అందాల తార చెన్నైలో పుట్టి పెరిగినప్పటికీ.. తెలుగింటికీ కోడలిగా వచ్చింది. మరి ఆమె ఎవరో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? అయితే మీకో క్లూ.. ‘ ఈ వేళలో నీవు.. ఏం చేస్తూ ఉంటావో’ అంటూ యూత్ ను మెస్మరైజ్ చేసిన హీరోయిన్. ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? ఆమె ఎవరో ? యస్. ఈ క్యూటీ మరెవరో కాదు గులాబి హీరోయిన్ మహేశ్వరి. పక్కన ఉన్నది ఆమె తమ్ముడు ఉదయ్ కార్తీక్ కుమార్ అలియాస్ ఉదయ్ అవిషేక్ కార్తీక్. కాగా మహేశ్వరి అతిలోక సుందరి దివంగత నటి శ్రీదేవికి కూతురు వరుస అవుతుంది. అయితే అందరూ వారిని అక్కా చెల్లెలనే భావిస్తారు.

ఇవి కూడా చదవండి

భారతీరాజా తెరకెక్కించిన ఓ తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది మహేశ్వరి. అప్పుడామెకు ఇంకా 17 ఏళ్ల వయసు మాత్రమే. ఆ తర్వవాత సుమన్ ఖైదీ ఇన్ స్పెక్టర్‌లో కనిపించింది. ఇక జేడీ చక్రవర్తితో కలిసి మహేశ్వరి నటించిన గులాబీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీని తర్వాత వీరి కాంబినేషన్ లో దెయ్యం, మృగం వంటి హిట్ సినిమాలు వచ్చాయి. మహేశ్వరి నటనా ప్రతిభకు మరో తార్కాణం పెళ్లి సినిమా. దీంతో పాటు ప్రియరాగాలు, నవ్వులాట, ఓ పనైపోతుంది బాబు, మా బాలాజీ, ప్రేమించేది ఎందుకమ్మా, రామసక్కనోడు, బలరామ్, మా అన్నయ్య, నాగులమ్మ, తిరుమల తిరుపతి వెంకటేశ, వెలుగు నీడలు తదితర సినిమాల్లో నటించి మెప్పించిందీ అందాల తార. రవితేజతో కలిసి నటించిన నీకోసం సినిమాకు నంది అవార్డు అందుకుంది మహేశ్వరి.

అక్కా తమ్ముళ్ల క్యూట్ ఫొటో..

కాగా 2008లో జయకృష్ణ అనే తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుని సినిమాలకు స్వస్థి పలికింది మహేశ్వరి. అప్పుడప్పుడు బుల్లితెరపై మాత్రమే సందడి చేస్తోంది . ఇక మహేశ్వరి తమ్ముడు ఉదయ్ కార్తీక్ కుమార్ అలియాస్ ఉదయ్ అవిషేక్ కార్తీక్ విషయానికి వస్తే.. గౌతమ్ మేనన్ దగ్గర అసోసియేట్‌గా పని చేసిన ఇతడు.. హీరోగా సినిమాలు చేస్తున్నాడు. సెల్వకుమార్.. తిరుమారన్ దర్శకత్వంలో ఫ్యామిలీ పదం అనే మూవీ లో కథానాయకుడిగా కనిపిస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us