
సినిమా సెలబ్రిటీల చిన్నప్పటి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంటాయి. ముఖ్యంగా వారి పుట్టిన రోజు లేదా ఇతర స్పెషల్ అకేషన్స్ లో త్రో బ్యాక్ ఫొటోస్, వీడియోస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. అలా ఒక టాలీవుడ్ హ్యాండ్సమ్ చిన్నప్పటి ఫొటో ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. పై ఫొటో అదే. ఇది దాదాపు 23 ఏళ్ల క్రితం నాటిది. 2002లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు టక్కరి దొంగ అనే సినిమా చేశాడు. ఇందులో కౌ బాయ్ పాత్రలో కనిపించి అభిమానులను అలరించాడు మహేష్. అయితే ఇదే సినిమా షూటింగ్ కు ఒక టాలీవుడ్ స్టార్ హీరో తన కుమారుడిని తీసుకొచ్చాడు. దీంతో ఆ పిల్లాడు కూడా మహేష్ బాబు లాగే మారిపోయాడు. నెత్తిపై టోపి పెట్టుకొని చేతిలో గన్ కూడా పట్టుకుని కౌబాయ్ లాగా మారిపోయి ఫొటోలకు పోజులిచ్చాడు. మరి ఆ పిల్లాడు ఎవరో గుర్తు పట్టారా? ఈ బుడ్డోడు ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫేమస్ హీరో. చాలా మంది హీరోల్లాగే ఛైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. చిన్నతనంలోనే తన క్యూట్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత హీరోగానూ ఎంట్రీ సక్సెస్ అయ్యాడు. ఈ హీరో ఇప్పటిదాకా ఓ ఐదారు సినిమాలు చేశాడు. అందులో రెండు, మూడు సినిమాలు బాగా ఆడాయి. గత కొంత కాలంగా వరుస అపజయాలు వచ్చినప్పటికీ ఈ హీరోకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఈ హీరో అంటే అమ్మాయిలు పడి చస్తారు.
పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు అక్కినేని అందగాడు అఖిల్. ఇవాళ (ఏప్రిల్ 08) అతని పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో అఖిల్ చిన్నప్పటి ఫొటోలు, వీడియోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ఇక అఖిల్ పుట్టిన రోజును పురస్కరించుకుని పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అతనికి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. కాగా అఖిల్ గతేడాది జూన్ లో జైనబ్ తో కలిసి పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే.
ఇక సినిమాల విషయానికి వస్తే.. చివరిగా ఏజెంట్ సినిమాలో కనిపించాడీ అక్కినేని హ్యాండ్సమ్ హీరో. 2023లో రిలీజైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచిపోయింది. ప్రస్తుతం లెనిన్ అనే సినిమాలో హీరోగా చేస్తున్నాడు అఖిల్. వినరో భాగ్యము విష్ణు కథతో డీసెంట్ హిట్టు కొట్టిన మురళి కిషోర్ అబ్బూరీ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైనమెంట్స్ బ్యానర్‌లపై అక్కినేని నాగార్జున, సూర్యవంశీ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. థమన్ స్వరాలు అందిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.