AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth: ఒకప్పుడు జేసీబీ డ్రైవర్.. ఇప్పుడు జబర్దస్త్‌లో అదరగొడుతున్నాడు.. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

సుమారు గత 14 ఏళ్లుగా బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తోండి జబర్దస్త్ కామెడీ షో. కంటెంట్ పరంగా ఈ టీవీ షోపై విమర్శలు ఉండచ్చు. కానీ ఎక్కడో మారు మూల ఉన్న ఎంతో మంది ట్యాలెంటెడ్ ఆర్టిస్టులను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిందీ జబర్దస్త్ షో.

Jabardasth: ఒకప్పుడు జేసీబీ డ్రైవర్.. ఇప్పుడు జబర్దస్త్‌లో అదరగొడుతున్నాడు.. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Jabardasth Actor
Basha Shek
|

Updated on: Jul 02, 2026 | 8:56 PM

Share

జబర్దస్త్.. 2013లో ప్రారంభమైన ఈ టీవీ షో ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తోంది. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఈ షోకు ఆదరణ, క్రేజ్ తగ్గిన మాట వాస్తవమే కానీ ఇప్పటికీ ఈ షోను క్రమం తప్పకుండా చూసేవారు చాలా మందే ఉన్నారు. రేటింగ్ లు, విమర్శల సంగతి పక్కన పెడితే.. జబర్దస్త్ వల్ల ఎంతో మంది ట్యాలెంటెడ్ ఆర్టిస్టులు వెలుగులోకి వచ్చారు. ఈ కామెడీ షోలో కంటెస్టెంట్స్, టీమ్ లీడర్లుగా పనిచేసిన ఎంతో మంది ఇప్పుడు సినిమాల్లో బిజీ బిజీగా ఉంటున్నారు. సుడిగాలి సుధీర్, గెటప్ శీను, వేణు, హైపర్ ఆది, రామ్ ప్రసాద్, రాకింగ్ రాకేష్, ధనాధన్ ధన్ రాజ్, చమ్మక్ చంద్ర, అదిరే అభి, జీవన్, రాకెట్ రాఘవ… ఇలా చాలా మంది జబర్దస్త్ ఆర్టి స్టులు ఇప్పుడు హీరోలుగా, డైరెక్టర్లుగా, సహాయక నటులుగా, కమెడియన్లుగా సత్తా చాటుతున్నారు. అయితే వీరంతా జబర్దస్త్ కు రాక ముందు ఎన్నో కష్టాలు పడ్డారు. కడుపు నింపుకోవడం కోసం పడరాని పాట్లు పడ్డారు. కుటుంబ పోషణ కోసం చిన్న వయసులోనే చేతికొచ్చిన పని చేశారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న జబర్దస్త్ కమెడియన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు. సినిమా ఇండస్ట్రీలోకి రాక ముందు ఈ నటుడు నైట్ వాచ్ మెన్ గా చేశాడు. జేసీబీ డ్రైవర్ గా నూ పని చేశాడు. కట్ చేస్తే.. ఇప్పుడు ఆ కష్టంతోనే జబర్దస్త్ లో స్టార్ కమెడియన్ గా మారిపోయాడు. సినిమాల్లోనూ నటిస్తూ బిజీ బిజీగా ఉంటున్నాడు. అతను మరెవరో కాదు తాగుబాతు పాత్రలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న తాగుబోతు రమేష్.

ప్రస్తుతం జబర్దస్త్ పాటు సినిమాల్లో నటిస్తోన్న తాగుబోతు రమేష్ ఆ మధ్యన ఓ టీవీ షోకు హాజరయ్యాడు. అక్కడ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇదే క్రమంలో తాను పడిన ఇబ్బందుల గురించి చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యాడు. ‘ బస్ కు వెళ్తే ఐదు రూపాయాలు ఖర్చు అవుతుందని.. అందుకే 5 రూపాయాలు జేబులో పెట్టుకుని నడుచుకుంటూ వెళ్లిన రోజులు నా జీవితంలో ఉన్నాయి. సినిమా అవకాశాల కోసం పగలంతా ఆఫీసుల చుట్టూ తిరిగాను. నటుడిగా గుర్తింపు వచ్చేవరకు నేను బతకడానికి ఎన్నో పనులు చేశాను. రాత్రిళ్లు వాచ్ మెన్ జాబ్ చేశాను. జేసీబీ డ్రైవర్ గా కూడా చేశాను’ అని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు రమేష్. దీంతో తన నటనతో అందరినీ నవ్వించే తాగుబోతు రమేష్ జీవితంలో ఇన్ని కష్టాలున్నాయా? అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి

భార్య, పిల్లలతో జబర్దస్త్ నటుడు తాగుబోతు రమేష్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us