Tollywood: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ ఫేమస్ నటి కమ్ స్టార్ యాంకర్.. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా..

ఓ స్టార్ హీరో కూతురిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అనతి కాలంలోనే తన ట్యాలెంట్ తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కేవలం నటిగానే నిర్మాతగానూ, యాంకర్ గానూ సత్తా చాటుతూ మల్టీ ట్యాలెంటెడ్ వుమన్ గా పేరు తెచ్చుకుంది.

Tollywood: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ ఫేమస్ నటి కమ్ స్టార్ యాంకర్.. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా..
Tollywood Actress

Updated on: Apr 30, 2025 | 2:20 PM

పై ఫొటోలో ఉన్న దెవరో గుర్తు పట్టారా? ఈ అమ్మాయి ఓ టాలీవుడ్ స్టార్ నటుడి కూతురు. తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ తను కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదట అమెరికన్ టెలివిజన్ లో పని చేసింది. ఆ తర్వాత టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. విలన్ గా అరంగేట్రం చేసి శభాష్ అనిపించుకుంది. ఆ తర్వాత నటిగానూ, నిర్మాత గానూ సత్తా చాటింది. కేవలం వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా తన ట్యాలెంట్ చూపించింది. పలు టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరించి బుల్లితెర ఆడియెన్స్ కు చేరువైంది. అయితే ఏమైందో కానీ ఈ మధ్యన సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైందీ అందాల తార.తన నివాసాన్ని కూడా ముంబైకు మార్చేసింది. అప్పుడప్పుడు మాత్రమే హైదరాబాద్ లో ప్రత్యక్షమవుతోంది. అయితే ఈ మధ్యన సామాజిక సేవా కార్యక్రమాలతోనూ వార్తల్లో నిలుస్తోందీ ముద్దుగుమ్మ. ముఖ్యంగా పేద విద్యార్థుల చదువుల కోసం తన వంతు కృషి చేస్తోంది. ఓ స్వచ్చంధ సేవా సంస్థతో చేతులు కలిపిన ఆమె తెలుగు రాష్ట్రాల్లోని సర్కారు బడులను దత్తత తీసుకుంటోంది. ఆ స్కూళ్లలో డిజిటల్ విద్య, కంప్యూటర్ ఎడ్యుకేషన్ తదితర మౌలిక వసతులు కల్పిస్తోంది. మరి ఇంత మంచి మనసున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తు పట్టారా? ఆమె మరెవరో కాదు మంచు వారమ్మాయి మంచు లక్ష్మి. ఇది తన చిన్న నాటి ఫొటో.

కాగా ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో వివాదం నడుస్తోంది. మంచు విష్ణు, మోహన్ బాబు కలిసి ఓ వైపు, మంచు మనోజ్ ఓ వైపు ఉండి పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే ఈ వివాదంపై ఇప్పటివరకు మంచు లక్ష్మి స్పందించలేదు. త్వరలోనే ఈ గొడవలన్నీ సద్దుమణుగుతాయంటూ మాత్రమే చెబుతోంది. ప్రస్తుతం ముంబైలోనే తన కూతురుతో కలిసి నివాసముంటోంది మంచు వారమ్మాయి. తన కూతురితో కలిసి వివిధ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటొంది.

ఇవి కూడా చదవండి

డ్యాన్స్ వీడియోలతో కాలక్షేపం..

ప్రస్తుతం సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటోన్న మంచు లక్ష్మి టీచ్ ఫర్ ఛేంజ్ అనే ఎన్జీవోతో కలిసి పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సర్కారు బడులను దత్తత తీసుకుని వాటిలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తోంది.

కూతురితో కలిసి ర్యాంప్ వాక్..

 

మంచు మనోజ్ ను చూసి ఎమోషనల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.