
పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఈ కుర్రాడు ఒకప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో. తన నటనతో ఎంతో మంది అమ్మాయిల మనసులను కొల్లగొట్టేశాడు. స్టార్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. కెరీర్ ప్రారంభంలో పెద్దగా అవకాశాలు రాకపోయినా ఆ తర్వాత హీరోగా స్థిరపడిపోయాడు. కథానాయకుడిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. ప్రధానంగా ప్రేమ కథా చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలతో అమ్మాయిలకు, ఫ్యామిలీ ఆడియన్స్ కు ఫేవరెట్ నటుడిగా మారిపోయాడు. తెలుగు నాట శోభన్ బాబు తర్వాత ఆ రేంజ్ లో ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకున్న హీరో ఇతనే. అయితే ఎన్నో సినిమాలు చేసి కోట్లాది ఆస్తులు కూడ బెట్టాడీ హ్యాండ్సమ్ హీరో. కానీ ఉన్నట్లుండి డౌన్ అయిపోయాడు. చేసిన సినిమాలు వరుసగా పరాజయం పాలయ్యాయి. దీనికి తోడు వ్యక్తిగత జీవితంలోనూ కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. ఫలితంగా కోట్లాది ఆస్తులు ఇట్టే కరిగిపోయాయి. అయితే గోడకు కొట్టిన బంతిలా మళ్లీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. విలన్ గా నూ, సపోర్టింగ్ ఆర్టిస్టుగా, ఇప్పుడు బుల్లితెర యాంకర్ గానూ సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీగా ఉంటోన్న ఆర్టిస్టుల్లో ఆయన కూడా ఒకరు. ఇంతకీ పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆయన మరెవరో కాదు జగ్గూ భాయ్ అలియాస్ జగపతి బాబు.
సుమారు 63 ఏళ్ల జగపతి బాబు ఇప్పుడు తీరిక లేని షూటింగులతో బిజి బిజీగా గడుపుతున్నారు. ఈ ఏడాది జగ్గు భాయ్ నటించిన మూడు సినిమాలు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పటికీ థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న మిరాయ్ లో జగ్గూ భాయ్ ఒక కీలక పాత్ర పోషించాడు. అలాగే అనుష్క ఘాటీలోనూ ఓ కీ రోల్ ప్లే చేశాడు. ఇక హిందీలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన జాట్ లోనూ మెరిశారు జగ్గూభాయ్. ప్రస్తుతం ఈ సీనియర్ నటుడి చేతిలో రామ్ చరణ్ పెద్ది లాంటి క్రేజీ ప్రాజెక్టు ఉంది.
Vantalu thelispothunayi baboi… pic.twitter.com/NNPIQEnkFY
— Jaggu Bhai (@IamJagguBhai) September 4, 2025
ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు హోస్ట్ గా బుల్లితెర ఆడియెన్స్ ను అలరిస్తున్నాడు జగ్గూ భాయ్. ప్రస్తుతం జయంబు నిశ్చయంబురా అనే టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడీ సీనియర్ నటుడు. నాగార్జున, శ్రీలీలీ, ఆర్జీవీ, సందీప్ రెడ్డి వంగా లాంటి స్టార్ సెలబ్రిటీలు ఈ షోలో సందడి చేశారు.
Haayiga joruga ushaaruga enjoy chesaanu. Kaani Moham ala ledhani naaku thelusu.. Em maayi rogam occhinddo…. pic.twitter.com/APTMob0mQg
— Jaggu Bhai (@IamJagguBhai) July 4, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.