పై ఫొటోలో ఉన్నదెవరో కనిపెట్టారా? నిజం చెప్పాలంటే ఫొటోలో కనిపిస్తున్నదానికి అతని నిజ జీవితానికి ఎలాంటి సంబంధం లేదు. పై ఫొటోలో ఎంతో అమాయకంగా రాముడిలా మంచి బాలుడిలా కనిపిస్తోన్నఅతని సినిమాలు చాలా వయొలెంట్ గా ఉంటాయి. అదే సమయంలో తన సినిమా వసూళ్లు కూడా ఓ రేంజ్ లో ఉంటాయి. అతను ఇప్పటివరకు మూడు సినిమాలు తీస్తే అన్నీ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. తన చివరి సినిమా ఏకంగా రూ.1000 కోట్లకు చేరువైంది. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ది మోస్ట్ ట్యాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరైన అతను మరెవరో కాదు యానిమల్ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. పై ఫొటో విషయానికి వస్తే.. కీర్తి సురేశ్ నటించిన మహానటి సినిమాలో సందీప్ రెడ్డి వంగా కూడా ఒక కీలక పాత్ర పోషించాడు. వేదాంతం రాఘవయ్యగా కొద్ది సేపు తెరపై కనిపించాడు. కానీ చాలామంది అతనిని గుర్తు పట్టలేకపోయారు. మళ్లీ ఇప్పుడు మహానటి సినిమాలోని సందీప్ స్టిల్స్ నెట్టింట వైరలవుతున్నాయి. కాగా డైరెక్టర్ గానే కాకుండా నటుడిగానూ సినిమాలు చేశాడు సందీప్ రెడ్డి
అతను కెమెరాను ఫేస్ చేసిన తొలి సినిమా కేడి.
నాగార్జున హీరోగా నటించిన కేడీ సినిమాకు సందీప్ రెడ్డి వంగా అసోసియేట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాడు. అదే సమయంలో సినిమాలోనూ తళుక్కుమన్నాడు. బోట్లో పోలీసుల వల్ల ప్రాణాలు కొల్పోయే పాత్రలో సందీప్ కనిపిస్తాడు. కాకపోతే అతని క్యారెక్టర్ కేవలం అర నిమిషం మాత్రమే ఉంటుంది. దీని తర్వాత విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమాలోనూ కనిపిస్తాడు సందీప్. విజయ్ డెహ్రాడూన్‌కు ట్రైనింగ్ కోసం వచ్చినప్పుడు.. ప్రీతి అర్జున్‌ను కలవడానికి వచ్చే సీన్‌లో ఈ డేరింగ్ డైరెక్టర్ కనిపిస్తాడు. అయితే ఇందులో కూడా అతని మోహం మాత్రమే కనిపిస్తుంది. ఆ తర్వాత మహానటి సినిమాలోను సందీప్ నటించాడు. ఈ సినిమలో వేదాంతం రాఘవయ్య పాత్రలో కాసేపు తళుక్కుమంటాడు సందీప్.
అలా మొత్తానికి సందీప్ రెడ్డి వంగా కెమెరా వెనకాలే కాదు కెమెరా ముందుకు కూడా వచ్చి నటించాడు. ప్రస్తుతం అతను ప్రభాస్ తో స్పిరిట్ సినిమా తెరకెక్కిస్తున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.