Tollywood: ఈ బుజ్జితల్లి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో భార్య.. ఎవరో గుర్తు పడితే మీరు తోపులే

|

Mar 26, 2025 | 8:55 AM

ఈ అమ్మాయి తండ్రి పెద్ద బిజినెస్ మ్యాన్. ఓ టీవీ ఛానెల్ కూడా ఉంది. వీరికి తెలుగు రాష్ట్రాల్లోని ఓ ప్రముఖ రాజకీయ నాయకుడితో దగ్గరి బంధుత్వం ఉంది. ఆయనే ఓ తెలుగు స్టార్ హీరోతో ఈ అమ్మాయి పెళ్లి కుదిర్చారు.

Tollywood: ఈ బుజ్జితల్లి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో భార్య.. ఎవరో గుర్తు పడితే మీరు తోపులే
Tollywood Celebrity
Follow us on

ఈ పాపను గుర్తు పట్టారా? ఈ అమ్మాయి టాలీవుడ్ ఫేమస్ సెలబ్రిటీ. అలాగనీ స్టార్ హీరోయినో, నటినో కాదు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలేస్తోన్న ఓ స్టార్ హీరో సతీమణి. తన ఇంట్లో అందరికీ సినిమాలతో సంబంధమున్నా ఈమె మాత్రం ఇండస్ట్రీ గురించి పెద్దగా ఆసక్తి చూపదు. బయట కూడా పెద్దగా కనిపించదు. కేవలం అరుదైన సందర్భాల్లో మాత్రమే ఫ్యామిలీతో కలిసి కనిపిస్తుంటుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు యాక్టివ్ గా ఉంటుంది. తన భర్త, పిల్లల గురించి ఆసక్తికరమైన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది. మరి ఈ క్యూటీ ఎవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు నందమూరి టైగర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి. బుధవారం (మార్చి 26) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా ప్రణతి చిన్ననాటి ఫొటోలు, ఆసక్తికర విషయాలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

కాగా లక్ష్మీ ప్రణతి పుట్టిన రోజును పురస్కరించుకుని ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. దేవర రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా జపాన్ వెళ్లిన ఎన్టీఆర్.. తన భార్య ప్రణతి పుట్టినరోజు వేడుకల్ని మంగళవారం రాత్రే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన రెండు ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు.’అమ్మలు.. హ్యాపీ బర్త్ డే’ అని తన భార్యకు బర్త్ డే విషెస్ చెప్పాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. నందమూరి అభిమానులు, నెటిజన్లు ఈఫొటోలకు లైకులు వర్షం కురిపిస్తున్నారు. అలాగే ప్రణతికి పుట్టిన రోజు విషెస్ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

భార్య లక్ష్మీ ప్రణతి బర్త్ డే వేడుకల్లో జూనియర్ ఎన్టీఆర్..

కాగా 2011లో తారక్-ప్రణతికి పెళ్లయింది. వీళ్లకు అభయ్ రామ్, భార్గవ రామ్ అనే ఇ‍ద్దరు కొడుకులు ఉన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్నాడు.

జపాన్ లో ఎన్టీఆర్..

జపాన్ లో తన అభిమానులతో కలిసి ఎన్టీఆర్ డ్యాన్స్.. వీడియో ఇదిగో..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..