పై ఫొటోలో నటి రోజాతో ఉన్న ఈ క్యూటీ ఎవరో గుర్తు పట్టారా? ఇప్పుడీ చిన్నారి టాలీవుడ్ లో హాట్ అండ్ బోల్డ్ బ్యూటీ. ఓ ధనిక కుటుంబంలో పుట్టిన ఈ నటి చదువులో బాగా చురుకు. అందుకే ఎంబీఏలో హెచ్ ఆర్ మేనెజ్మెంట్ పూర్తి చేసి అమెరికాకు వెళ్లిపోయింది. అక్కడే చాలా రోజులు జాబ్ చేసింది. అదే సమయంలో టైం పాస్ కోసం, ఖాళీ సమయాల్లో ఇన్ స్టా గ్రామ్ రీల్స్, టిక్ టాక్ వీడియోలు చేసింది. దీంతో ఈ అమ్మడికి నెట్టంట క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అదే సమయంలో ఓ తెలుగు సినిమాలో అనుకోకుండా అవకాశం వచ్చింది. అమెరికాలో షూట్ కావడంతో జాబ్ చేస్తూనే షూటింగ్ కు హాజరైంది. తీరా ఆ సినిమా రిలీజయ్యాక ఏకంగా బిగ్ బాస్ షోలో ఛాన్స్ వచ్చిందీ అందాల తారకు. అంతే జాబ్ ను, అమెరికాను వదిలేసి ఇండియాకు వచ్చేసింది. ఇప్పుడు నటిగా, యాంకర్ గా రాణిస్తూ టాలీవుడ్ లో మల్టీ ట్యాలెంటెడ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. మరి ఈ క్యూటీ ఎవరో గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే మీకో క్లూ.. సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో ఈ అమ్మడి పేరు టాలీవుడ్ లో మార్మోగిపోయింది. యస్. తన మరెవరో కాదు అషూ రెడ్డి. ఇది ఆమె చిన్ననాటి ఫొటో.
నితిన్ హీరోగా నటించిన ఛల్ మోహన్ రంగ సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించింది అషూ రెడ్డి. అందులో అమెరికాలో ఉండే పలు సీన్స్ లో హీరోయిన్ ఫ్యామిలీ మెంబర్ లా అషూ రెడ్డి కనిపిస్తుంది. ఛల్ మోహన్ రంగ సినిమా 2018లో రిలీజ్ కాగా, ఆ మరుసటి ఏడాదే అంటే 2019లో బిగ్ బాస్ సీజన్ 3లో ఛాన్స్ వచ్చిందీ అందాల తారకు. దీంతో ఈ అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక రామ్ గోపాల్ వర్మ తో బోల్డ్ ఇంటర్వ్యూ అషూ రెడ్డిని సెన్సేషన్ చేసింది. ప్రస్తుతం ఎక్కువగా టీవీ షోల్లోనే కనిపిస్తోందీ అందాల తార. అప్పుడప్పుడు వెండితెరపైనా కనిపిస్తోంది.
ఇక సోషల్ మీడియాలోనూ అషూ రెడ్డికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ ముద్దుగుమ్మ షేర్ చేసే గ్లామరస్ ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.