Tollywood: ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. పెళ్లైన ఐదేళ్లకే భర్త మరణం.. ఇప్పుడిలా.. ఎవరో గుర్తు పట్టారా?

ఒకప్పుడు తన అందం, అభినయంతో అబ్బాయల కలల రాణిగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. సూపర్ హిట్ సీరియల్స్ లోనూ నటించి బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. అయితే భర్త చనిపోయాక ఈ అమ్మడు..

Tollywood: ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. పెళ్లైన ఐదేళ్లకే భర్త మరణం.. ఇప్పుడిలా.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actress

Updated on: Jun 25, 2025 | 8:34 PM

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆమె ఒక స్టార్ హీరోయిన్ సొదరి. ఈ బ్యూటీ కూడా క్రేజీ హీరోయినే. అక్కకు పోటీగా తన అందం, అభినయంతో ఆడియెన్స్ ను కవ్వించింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్ భాషల సినిమాల్లోనూ నటించి మెప్పించింది. అయితే దక్షిణాదిలో హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉండగానే బాలీవుడ్ కు వెళ్లిపోయింది. అక్కడ కూడా చాలా సినిమాల్లో నటించింది. అదే క్రమంలోఅక్క‌డ ఓ ప్రముఖ హిందీ హీరోను పెళ్లి చేసుకుంది. దీంతో క్రమంగా ఆమె కూడా సినిమాలకు దూరమైంది. అయితే ఈ ప్రేమ బంధం ఎంతో కాలం నిలవలేదు. పెళ్లైన 5 ఏళ్లకే భర్త మరణించాడు. ఈ విషాదాన్నిఆమె జీర్ణించుకోలేకపోయింది. ఈ విషాదం నుంచి తేరుకోవడానికి తనకు కొన్నేళ్లు పట్టింద. కాగా గత కొన్నేళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ అందాల తార ఇటీవలే సెకెండ్ ఇన్నింగ్స్ ను కూడా స్టార్ట్ చేసింది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో పంచుకుంటోంది. అయితే ఇటీవల ఆమె గుండుతో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన ఫొటోలు నెట్టింట బాగా వైరలయ్యాయి. చాలా మంది ఆమెను గుర్తు పట్టలేకపోయారు. మరి మీరు గుర్తు పట్టారా? ఆమె ఎవరో? తను మరెవరో కాదు భానుప్రియ చెల్లెలు అలనాటి హీరోయిన్ శాంతి ప్రియ.

తెలుగులో మహర్షి, కలియుగ అభిమన్యుడు, సింహ స్వప్నం.. లాంటి పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది శాంతి ప్రియ. నటిగా బిజీగా ఉన్న సమయంలోనే 1999లో బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్‌రాయ్‌ను వివాహం చేసుకుంది. అయితే 2004లో గుండెపోటుతో సిద్ధార్థరాయ్‌ కన్నుమూశాడు. అప్పటి నుంచే ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్యాడ్ గర్ల్ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోంది. ఇదే క్రమంలో గుండుతో ఉన్న ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. మహిళలందరూ తమకు నచ్చినట్లు బతకాలంటూ చనిపోయిన తన భర్త సిద్ధార్థ్‌ రాయ్‌ బ్లేజర్‌ ధరించి సందేశమిచ్చింది. ఇక ఈ మధ్యన గిరిజనులతో కలిసి నృత్యం చేసిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కూడా నెట్టింట వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

శాంతిప్రియ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .