Tollywood: 7 ఏళ్లకే సినిమాల్లోకి.. 17 ఏళ్లకే బిగ్ బాస్‌లోకి.. ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ను గుర్తు పట్టారా?

యాక్టింగ్, సింగింగ్, రైటింగ్.. ఇలా పలు రంగాల్లో సత్తా చాటుతూ మల్టీ ట్యాలెంటెడ్ వుమన్ గా పేరు తెచ్చుకుందీ టాలీవుడ్ హీరోయిన్. తెలుగులో ఈమె నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు.. కానీ తన అందం, అభినయంతో ఫుల్ మార్కులు కొట్టేసిందీ అందాల తార.

Tollywood: 7 ఏళ్లకే సినిమాల్లోకి.. 17 ఏళ్లకే బిగ్ బాస్‌లోకి.. ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ను గుర్తు పట్టారా?
Tollywood Actress

Updated on: Aug 15, 2025 | 8:17 PM

పై ఫొటోలో క్యూట్ గా కనిపిస్తోన్న పాపను గుర్తు పట్టారా? ఆమె ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. తెలుగుతో పాటు హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తోంది. ముంబయిలో పుట్టిన ఆమె ఏడేళ్ల వయసులోనే ఛైల్డ్ ఆర్టిస్టుగా బుల్లితెరకు పరిచయమైంది. పలు సూపర్ హిట్ సీరియల్స్ లో నటించి మెప్పించింది. ఇక 14 ఏళ్లకే సాంగ్ కంపోజ్ చేసింది. అలాగే 17 ఏళ్లకే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది. తద్వారా ఈ రియాలిటీ షోలో పాల్గొన్న అతి పిన్న కంటెస్టెంట్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. దీని తర్వాత బాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ కొన్ని రొమాంటిక్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక తెలుగులోనూ సుమారు 5 సినిమాలు చేసిందీ అందాల తార. కార్తికేయ, గోపీచంద్, అశ్విన్ బాబు వంటి క్రేజీ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. కానీ నటిగా మంచి మార్కులే కొట్టేసింది. అలాగే గ్లామర్ పరంగానూ ఆకట్టుకుంది. మరి ఈ క్యూటీ ఎవరో గుర్తు పట్టారా? తను మరెవరో కాదు దిగంగనా సూర్యవంశీ.

2018లో కార్తికేయ హీరోగా నటించిన హిప్పీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది దిగంగనా సూర్యవంశీ. ఆ తర్వాత 2021లో తెలుగు లో వచ్చిన “సీటీమార్” సినిమాతో అందరిని ఆకట్టుకుంది. ఇందులో హీరోయిన్ తమన్నాతో పోటీ పడి నటించిందీ అందాల తార. వీటితో పాటు వలయం, క్రేజీ ఫెలో, శివం భజే సినిమాల్లోనూ హీరోయిన్ గా నటించిందీ సొగసరి. అయితే తనకు సరైన బ్రేక్ రావడం లేదు. అందం, అభినయం పరంగా మంచి పేరొచ్చినా సినిమాలు సక్సెస్ కావడం లేదు.

ఇవి కూడా చదవండి

దిగంగనా సూర్యవంశీ లేటెస్ట్ ఫొటోస్..

సినిమాల సంగతి పక్కన పెడితే.. సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తను షేర్ చేసే గ్లామరస్ ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది.

టాలీవుడ్ హీరోయిన్ మరిన్ని ఫొటోస్..

మహా కుంభమేళాలో దిగంగనా సూర్యవంశీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.