Tollywood: ఈ ఛైల్డ్ ఆర్టిస్ట్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు తెలుగు ఆడియెన్స్‌ బాగా అభిమానించే హీరోయిన్

|

Nov 30, 2024 | 5:01 PM

ఛైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు స్టార్ హీరో, హీరోయిన్లుగా ఎదిగిన వారు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి కూడా సరిగ్గా ఈ కోవకే చెందుతుంది. బాల నటిగా సినిమా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది.

Tollywood: ఈ ఛైల్డ్ ఆర్టిస్ట్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు తెలుగు ఆడియెన్స్‌ బాగా అభిమానించే హీరోయిన్
Tollywood Actress
Follow us on

పై ఫొటోలో చిరునవ్వులు చిందిస్తోన్న పాపను గుర్తు పట్టారా? ఈ అమ్మాయి ఇప్పుడు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలోనే క్రేజీ హీరోయిన్. తల్లిదండ్రులిద్దరూ సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే. అయితే వార అంతగా సక్సెస్ కాకపోయినా.. ఈ అమ్మాయి మాత్రం జెట్ స్పీడ్ వేగంతో ఇండస్ట్రీలోకి దూసుకొచ్చింది. ఛైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత హీరోయిన్ గా అడుగు పెట్టింది. ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే లేడీ ఓరియంటెడ్ సినిమాలతో మెప్పించింది. తన అభినయ ప్రతిభకు ప్రతీకగా ఏకంగా జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని కూడా సొంతం చేసుకుంది. కేవలం తెలుగులోనే కాదు తమిళం, మలయాళం సినిమాల్లోనూ మెరుస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ పై కూడా కన్నేసింది. అయితే త్వరలోనే ఈ అందాల తార తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. తన చిరకాల స్నేహితుడితో కలిసి పెళ్లిపీటలెక్కనుంది. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. ఈ క్యూటీ మరెవరో కాదు మన మహానటి కీర్తి సురేష్. ఇటీవల తన ప్రేమ విషయాన్ని అధికారికంగా బయటపెట్టిందీ క్రేజీ హీరోయిన్. ఈ నేపథ్యంలో కీర్తికి సంబంధించిన చిన్న నాటి ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

కీర్తి సురేష్ చైల్ట్ ఆర్టిస్టుగా అలరించి.. గీతాంజలి అనే మలయాళ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తెలుగులో నేను శైలజ మూవీతో తెరంగేట్రం చేసింది. ఇక మహానటి సినిమాలో సావిత్రి పాత్రకు గానూ జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది. మధ్యలో కొన్ని సినిమాలు నిరాశపర్చినా మహేశ్ బాబు సర్కారు వారి పాట సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది. దసరాతో మరో బ్లాక్ బస్టర్ మూవీని ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకోనుంది.

ఇవి కూడా చదవండి

 

ప్రియుడిని పరిచయం చేస్తూ కీర్తి సురేష్ పోస్ట్..


సినిమాల సంగతి పక్కన పెడితే.. కీర్తి సురేష్ త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనుంది . తన చిన్ననాటి స్నేహితుడు ఆంథోని తట్టిల్ తో కలిసి కొత్త జీవితం ప్రారంభించనుంది. వచ్చేనెలలోనే ఈ ముద్దుగుమ్మ వివాహం జరగనుంది.

బేబీ జాన్ సినిమాలో వరుణ్ ధావన్ , కీర్తి సురేష్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.