AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akkineni Nagarjuna: నాగార్జున శివ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా.. ?

టాలీవుడ్ ఎవర్ గ్రీన్ చిత్రాల్లో నాగార్జున నటించిన శివ ఒకటి. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలోని సాంగ్స్ సైతం అప్పట్లో సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాతో ఇండస్ట్రీలో నాగార్జున క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.

Akkineni Nagarjuna: నాగార్జున శివ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా.. ?
Shiva Movie
Rajitha Chanti
|

Updated on: Nov 30, 2024 | 4:21 PM

Share

విభిన్న ప్రయోగాలు, సాహసోపేతమైన ప్రయత్నాలు చేయడంలో ముందుంటారు హీరో అక్కినేని నాగార్జున. అలాగే తెలుగు వెండితెరకు ఎంతో మంది కొత్త హీరోయిన్లను, డైరెక్టర్లను పరిచయం చేసిన ఘనత నాగార్జునకే సొంతం. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన నాగ్.. ఇప్పుడు కాస్త సినిమాలు తగ్గించాడు. ఎప్పుడో ఒక ప్రాజెక్ట్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా నా సామిరంగ సినిమాతో హిట్టు ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుభేర చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో కోలీవుడ్ హీరో ధనుష్ సైతం కీలకపాత్ర పోషిస్తున్నాడు. అలాగే మరోవైపు బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షో హోస్టింగ్ చేస్తూ బిజీగా ఉంటున్నాడు నాగ్. ఇదిలా ఉంటే.. నాగార్జన కెరీర్ లో ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ చిత్రం శివ.

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున నటించిన శివ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో అప్పట్లో నాగ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. అంతేకాదు.. ఆర్జీవీ మేకింగ్, డైరెక్షన్ చూసి అడియన్స్ ఫిదా అయ్యారు. ఇందులోని అనేక సన్నివేశాలకు ఆర్జీవీ వాడిన కెమెరా యాంగిల్స్, షాట్స్ మేకింగ్ హాలీవుడ్ చిత్రాలకు మించిపోయిందనే చెప్పారు. ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. అప్పట్లోనే ఈ సినిమా దాదాపు రూ.5 కోట్ల షేర్ రాబట్టింది. అతి తక్కువ ప్రింట్స్ తో విడుదలైన ఈ సినిమా దాదాపు అన్నీ సెంటర్లలో గతంలోని రికార్డ్స్ బ్రేక్ చేసింది. అయితే ఈ సినిమాకు ముందుగా నాగార్జునను అనుకోలేదట. ఎందుకంటే అప్పటికే నాగార్జున రొమాంటిక్ లవ్ స్టోరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. అలాంటి హీరోతో ఇలా మాస్ రోల్ చేయడం బాగుండదేమో అనుకున్నారట.

ఈ చిత్రాన్ని వెంకటేశ్ తో తెరకెక్కించాలని.. ఈ మూవీ స్టోరీని రామానాయుడుకు వినిపించాలని దాదాపు గంటకు పైగా ఎదురుచూశాడట. అయితే ఆ సమయంలో వెంకీ కుటుంబకథా చిత్రాలు చేస్తున్నడాని.. ఇలాంటి మాస్ యాంగిల్ సినిమా చేస్తే ప్రేక్షకులకు నచ్చుతుందో లోదో అని సందేహపడ్డారట రామానాయుడు. ఈ కథకు నాగార్జున అయితే కరెక్ట్ గా సెట్ అవుతాడని చెప్పడంతో చివరకు నాగార్జునతో శివ సినిమాను తెరకెక్కించారట. అలా శివ బ్లాక్ బస్టర్ హిట్ నాగ్ ఖాతాలో పడింది.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
ఇంట్లో దొరికే వీటితో తులసి మొక్కను పచ్చగా, గుబురుగా మార్చేయండి..
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!
నవరాత్రుల సమయంలో పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!