Tollywood: ఈ చిన్నారిని గుర్తు పట్టారా? 40 ఏళ్లుగా సినిమాలు చేస్తోన్న హీరోయిన్.. ఇప్పటికీ తరగని అందం

|

Sep 16, 2024 | 8:28 AM

పై ఫొటోలో అమాయకంగా కనిపిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా? ఆమె తెలుగు స్టార్ నటి. దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణ, కమల్ హాసన్, రజనీకాంత్, మోహన్ లాల్ తదితర స్టార్స్ తో కలిసి స్క్రీన్‌ షేర్ చేసుకుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఎన్నో సినిమాల్లో నటించి అక్కడి ప్రేక్షకులను మెప్పించింది.

Tollywood: ఈ చిన్నారిని గుర్తు పట్టారా? 40 ఏళ్లుగా సినిమాలు చేస్తోన్న హీరోయిన్.. ఇప్పటికీ తరగని అందం
Tollywood Actress Childhood Photo
Follow us on

పై ఫొటోలో అమాయకంగా కనిపిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా? ఆమె తెలుగు స్టార్ నటి. దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణ, కమల్ హాసన్, రజనీకాంత్, మోహన్ లాల్ తదితర స్టార్స్ తో కలిసి స్క్రీన్‌ షేర్ చేసుకుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ఎన్నో సినిమాల్లో నటించి అక్కడి ప్రేక్షకులను మెప్పించింది. అందం, అభినయంతో అప్పట్లో సినీ ప్రియులను కట్టి పడేసిన ఈ అందాల తార పెళ్లయ్యాక క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ, స్పెషల్ రోల్స్ తోనూ ఆడియెన్స్ ను అలరిస్తోంది. ఛైల్డ్ ఆర్టిస్టుగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఆమెది ఇండస్ట్రీలో సుమారు 40 ఏళ్ల ప్రస్థానం. ప్రస్తుతం వెండితెరతో పాటు బుల్లితెర ప్రేక్షకలను ఎంటర్ టైన్ చేస్తోన్న ఈ క్యూటీ మరెవరో కాదు సీనియర్ హీరోయిన్ మీనా. సోమవారం (సెప్టెంబర్ 16) ఆమె పుట్టిన రోజు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు మీనాకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అలాగే ఈ అందాల తారకు సంబంధించిన చిన్ననాటి, అరుదైన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. పై ఫొటో అందులోదే.

సినిమాల సంగతి పక్కన పెడతే.. 2009లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విద్యాసాగర్‌తో మీనా వివాహం జరిగింది. ఈ దంపతులకు నైనికా అనే కుమార్తె ఉంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన పోలీసోడు (తమిళ్ లో తేరీ) సినిమాతో నైనికా కూడా ఛైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది. కాగా కోవిడ్ సమయంలో మీనా సాగర్ కన్నుమూశారు. ఈ విషాదం నుంచి కోలుకోవడానికి మీనాకు చాలా సమయమే పట్టింది.

ఇవి కూడా చదవండి

నటి మీనా లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

 

ప్రస్తుతం తెలుగు, తమిళ్ సినిమాలతో పాటు కొన్ని టీవీ షోల్లో సందడి చేస్తోంది మీనా. ఈ ఏడాది మలయాళలంలో ఆనందపురం డైరీస్ అనే సినిమాలో నటించింది మీనా. ప్రస్తుతం రౌడీ బేబీ అనే తమిళ్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది.

మంచు కొండల్లో పుష్ప 2 హుక్ స్టెప్ వేస్తోన్న మీనా.. వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.