
సీనియర్ హీరో శ్రీకాంత్ వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు రోషన్. మొదట 2015లో అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన రుద్రమ దేవి సినిమాలో ఛైల్డ్ ఆర్టిస్టుగా కనిపించాడు. ఆ మరుసటి ఏడాది అంటే 2016లో వచ్చిన నిర్మలా కాన్వెంట్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. నాగ కోటేశ్వర రావు తెరకెక్కించిన ఈ టీనేజ్ లవ్ స్టోరీలో శ్రియా శర్మ హీరోయిన్ గా నటించింది. మన్మథుడు అక్కినేని నాగార్జున మరో కీలక పాత్ర పోషించాడు. కాగా ఇదే సినిమాలో రోషన్ స్నేహితులుగా ఇద్దరు స్టార్ కిడ్స్ కూడా నటించారు. పై స్టిల్ ఆ సినిమాకు సంబంధించినదే. అందులో రోషన్ పక్కనున్నదెవరో గుర్తు పట్టారా? రోషన్ లాగే ఆ కుర్రాడు కూడా ఆ స్టార్ కిడ్ కూడా. ఇప్పుడు అతను పెరిగి పెద్దవాడయ్యాడు. హీరోగా ఇండస్ట్రీకి కూడా పరిచయం అయ్యాడు . ఈ హీరో నటించిన ఒక సినిమా శనివారమే (డిసెంబర్ 13) శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో ఈ హీరో పేరు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. మరి అతనెవరో ఈ పాటికే చాలా మంది కనిపెట్టేసి ఉంటారు. అందులో రోషన్ పక్కనున్నది మరెవరో కాదు స్టార్ యాకంర్ సుమ కనకాల కుమారుడు రోషన్ కనకాల.
రోషన్ కనకాల హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా మోగ్లీ. కలర్ ఫొటో ఫేమ్ దర్శకుడు సందీప్ రాజ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. పుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు మొదటి రోజు .1.22 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. దీంతో చిత్ర బృందం సంతోషంలో మునిగి తేలుతోంది.
కుమారుడి సినిమా చూసి యాంకర్ సుమ ఎమోషనల్.. వీడియో
కొడుకు @RoshanKanakala విజయం చూసి తల్లి @ItsSumaKanakala ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.. #Mowgli 👋 pic.twitter.com/qUcMowK03Z
— Milagro Movies (@MilagroMovies) December 13, 2025
రోషన్ కనకాల హీరోగా నటించిన మొదటి సినిమా బబుల్ గమ్. 2023లో రిలీజైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. ఆ తర్వాత ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ వెబ్ సిరీస్ లోనూ ఓ కీలక పాత్ర పోషించాడు రోషన్. ఇప్పుడు మోగ్లీ సినిమాతో మరోసారి ఆడియెన్స్ ను పలకరించాడీ స్టార్ కిడ్. కాగా ఈ మూవీని యాంకర్ సుమ తన కుమారుడితో కలిసి థియేటర్ లో వీక్షించింది. తెరపై కొడుకు నటనను చూసి తీవ్ర భావోద్వేగానికి గురైంది. థియేటర్లోనే తన కుమారుడు రోషన్‌ను హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#Mowgli gets off to a phenomenal start at the box office 🏇❤️
Wild Blockbuster #Mowgli2025 grosses ₹1.22 crore worldwide on Day 1, including premieres ❤️🔥❤️🔥
A @SandeepRaaaj Cinema
A @Kaalabhairava7 musical 🎵🌟ing @RoshanKanakala, @SakkshiM09 &… pic.twitter.com/WfhjIIEMgY
— People Media Factory (@peoplemediafcy) December 14, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.