Tollywood: ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో.. అమ్మాయిలు పడి చస్తారు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన టక్కరి దొంగ సినిమా గుర్తుందా? అందులో కౌబాయ్ అవతారంలో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నాడు మహేష్. అయితే ఇదే సినిమా షూటింగ్ కు ఒక బుడ్డోడు కూడా హాజరై కౌబాయ్ వేషం వేసుకున్నాడు. ఇప్పుడు ఆ బుడ్డోడు టాలీవుడ్ లో క్రేజీ హీరోగా ఎదిగాడు.

Tollywood: ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో.. అమ్మాయిలు పడి చస్తారు
Akhil Akkineni

Updated on: Jan 02, 2026 | 7:01 PM

పై ఫొటోలో కౌబాయ్ వేషంలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఈ బుడ్డోడు ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో. ఛైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. చిన్నతనంలోనే తన క్యూట్ యాక్టింగ్ తో మెప్పించాడు. ఆ తర్వాత హీరోగానూ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటిదాకా ఓ ఐదారు సినిమాలు చేశాడు. అందులో రెండు మూడు మూవీస్ మంచి గానే ఆడాయి. ఈ మధ్యన వరుస ఫ్లాపులతో సతమవుతున్నప్పటికీ ఈ నటుడికి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఈ హీరో అంటే అమ్మాయిలు పడి చస్తారు. పై ఫొటో విషయానికి వస్తే.. ఇది దాదాపు 23 ఏళ్ల క్రితం నాటిది. 2002లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు టక్కరి దొంగ అనే సినిమా చేశాడు. ఇందులో మహేష్ సరికొత్తగా కౌ బాయ్ పాత్రలో కనిపించాడు. తన క్రేజీ లుక్ తో అభిమానులను ఆకట్టుకున్నాడు. అయితే ఇదే సినిమా షూటింగ్ కు ఒక టాలీవుడ్ స్టార్ హీరో తన కుమారుడిని తీసుకొచ్చాడు. దీంతో మూవీ షూట్ లో ఆ పిల్లాడు మహేష్ బాబు లాగే కౌబాయ్ వేషం ధరించాడు. నెత్తిపై టోపి పెట్టుకొని చేతిలో గన్ కూడా పట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చాడు. అన్నట్లు ఈ బుడ్డోడు చిన్నప్పుడే బాగా ఫేమస్ అయ్యాడు. ఒక సినిమాలో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించి అందరి దృష్టిని ఆకర్షించాడు.

మరి ఆ పిల్లాడు ఎవరో గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? తీక్షణంగా చూస్తే ఈజీగా గుర్తు పట్టవచ్చు. అందులో ఉన్నది మరెవరో కాదు అక్కినేని అఖిల్.

ఇవి కూడా చదవండి

భార్యతో అక్కినేని అఖిల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.