Tollywood: ఈ చిన్ని కృష్ణుడు ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో.. రోజూ 350 మందికి ఉచితంగా భోజనాలు పంపిస్తున్నాడు

సినిమా తారల చిన్నప్పటి ఫొటోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అభిమానులు, నెటిజన్లు కూడా తమ అభిమాన తారల చిన్న నాటి ఫొటోలను చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. అలా టాలీవుడ్ కు చెందిన ఓ క్రేజీ హీరోకు సంబంధించిన చిన్ననాటి ఫొటో ఇప్పుడు వైరలవుతోంది.

Tollywood: ఈ చిన్ని కృష్ణుడు ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో.. రోజూ 350 మందికి ఉచితంగా భోజనాలు పంపిస్తున్నాడు
Tollywood Actor

Updated on: Feb 24, 2025 | 12:39 PM

చిన్ని కృష్ణుడి గెటప్ లో ఉన్న అబ్బాయిని గుర్తు పట్టారా? అతను ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరో. ప్రముఖ కెమెరామెన్ మేనల్లుడి ట్యాగ్ తో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. విలన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత సోలో హీరోగానూ సక్సెస్ అయ్యాడు. ప్రారంభంలో ఎక్కువగా యూత్ ఫుల్, రొమాంటిక్ లవ్ సినిమాల్లోనే నటించిన హీరో ఆ తర్వాత రూటు మార్చాడు. వైవిధ్యమైన కథలతో సినిమాలు సెలెక్ట్ చేసుకున్నాడు. అవసరమైతే ఇతర హీరోల సినిమాల్లో నూ నటించడానికి ఏమాత్రం వెనకడుగు వేయలేదు. జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోన్న ఈ యంగ్ హీరో ఈ మధ్యన తన సేవా కార్యక్రమాలతో నూ అందరి మన్ననలు అందుకుంటున్నాడు. మరి అందమైన మనసు ఉన్న ఈ హ్యాండ్సమ్ హీరోను గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే మీకో క్లూ ఈ శివరాత్రికి ఈ హీరో నటించిన ఓ కామెడీ ఎంటర్ టైనర్ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇందులో మన్మథుడు హీరోయిన్ అన్షు కూడా ఓ కీలక పాత్ర పోషించింది. ఈ పాటికే అర్థమై ఉంటుంది. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. అతను మరెవరో కాదు సందీప్ కిషన్. ఇది అతని చిన్ననాటి ఫొటో.

 

ఇవి కూడా చదవండి

సందీప్ కిషన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా మజాకా. ధమాకా ఫేమ్ త్రినాథ రావు నక్కిన తెరకెక్కించిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ లో రీతూ వర్మ హీరోయిన్ గా నటించింది. అలాగే అన్షు, రావు రమేశ్, హైపర్ ఆది, శ్రీనివాస రెడ్డి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటిక అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా మహా శివరాత్రి కానుకగా ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమాల సంగతి పక్కన పెడితే.. వివాహ భోజనంబు పేరుతో రెస్టారెంట్ బిజినెస్ నిర్వహిస్తున్నాడు సందీప్ కిషన్. దీనికి మొత్తం ఏడు బ్రాంచ్ లు ఉన్నాయి. అయితే ప్రతి బ్రాంచ్ రెస్టారెంట్స్ నుంచి ప్రతిరోజూ ఉచితంగా 50 మందికి భోజనాలు పంపిస్తుంటాడు సందీప్ కిషన్. అవసరం ఉన్న పేదలు, కూలీలు, అనాథశ్రమాలు, వృద్ధాశ్రమాలకు డైలీ ఒక్కో రెస్టారెంట్ నుంచి 50 మందికి ఫుడ్ పంపిస్తున్నడు. అంటే రోజూ సుమారు 350 మంది పేదల కడుపు నింపుతున్నాడీ హ్యాండ్సమ్ హీరో. నెలకు దాదాపు నాలుగున్నర లక్షల విలువ చేసే ఆహారాన్ని ఉచితంగా పంచి పెడుతున్నట్లు ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు సందీప్ కిషన్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.