AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నారి నారి నడుమ మురారి.. ఇద్దరు స్టార్ హీరోయిన్స్ మధ్యలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా.?

సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ పిక్స్ వరకు సోషల్ మీడియాలో నిత్యం చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఎక్కువగా హీరోయిన్స్ కు సంబందించిన ఫోటోలు చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా ఓ ఫోటో ఇప్పుడు నెటిజన్స్ సృష్టిని ఆకర్షిస్తుంది. పైన కనిపిస్తున్న ఫోటోను చూశారా.. ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ఒకే ఫ్రెమ్ లో ఉన్నారు. ఒకప్పుడు టాలీవుడ్ లో రాణించారు ఈ భామలు.. నగ్మా, రమ్యకృష్ణ. ఈ ఇద్దరూ టాప్ హీరోయిన్స్ గా తెలుగు ఇండస్ట్రీని కొన్నేళ్లు ఏలారు.

నారి నారి నడుమ మురారి.. ఇద్దరు స్టార్ హీరోయిన్స్ మధ్యలో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా.?
Actress
Rajeev Rayala
|

Updated on: Feb 14, 2024 | 6:33 PM

Share

సోషల్ మీడియాలో చాలా మంది ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. సినీ సెలబ్రెటీల ఫోటోలకు నెట్టింట కొదవే లేదు. సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ పిక్స్ వరకు సోషల్ మీడియాలో నిత్యం చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఎక్కువగా హీరోయిన్స్ కు సంబందించిన ఫోటోలు చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా ఓ ఫోటో ఇప్పుడు నెటిజన్స్ సృష్టిని ఆకర్షిస్తుంది. పైన కనిపిస్తున్న ఫోటోను చూశారా.. ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ఒకే ఫ్రెమ్ లో ఉన్నారు. ఒకప్పుడు టాలీవుడ్ లో రాణించారు ఈ భామలు.. నగ్మా, రమ్యకృష్ణ. ఈ ఇద్దరూ టాప్ హీరోయిన్స్ గా తెలుగు ఇండస్ట్రీని కొన్నేళ్లు ఏలారు. అయితే ఆ స్టార్ హీరోయిన్స్ మధ్యలో ఉన్న గురువుగారిని గుర్తుపట్టారా..? ఆయన చాలా పాపులర్. ఈ మధ్యకాలంలో ఆయన పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఇంతకు ఆ ఫొటోలో ఉన్న ప్రముఖ వ్యక్తి ఎవరో తెలుసా..?

‘పై ఫొటోలో రమ్యకృష్ణ, నగ్మా మధ్యలో ఉన్న వ్యక్తి మరెవరో కాదు. ఈ మధ్య సెలబ్రెటీల జాతకాలు చెప్తూ.. ఎవరు ఎప్పుడు విడిపోతారు. ఎప్పుడు చనిపోతారో చెప్తూ పాపులర్ అయిన వేణు స్వామి. ఈ గురువుగారి పేరు తెలియని వారు ఉండరు. ముఖ్యంగా ఇండస్ట్రీలో స్టార్ కపుల్ గా ఉన్న నాగ చైతన్య , సమంత విడిపోతారని చేపి షాక్ ఇచ్చారు వేణు స్వామి. ఆయన చెప్పినట్టే సమంత నాగ చైతన్య విడిపోయారు. అలాగే కొంతమంది సెలబ్రెటీలు అనారోగ్యంకు గురవుతారని.. కొంతమంది చనిపోతారని కూడా చెప్పుకొచ్చారు. అంతే కాదు కొందరు హీరోయిన్స్ ఈయన చేత ప్రత్యేక పూజలు కూడా చేయించుకున్నారు.

వేణు స్వామి ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో సినీ ఇండస్ట్రీలో ఉన్నారు. చాలా సినిమాలకు ఆయన పూజలు చేశారు. వేణు స్వామి సినిమా ఒపింగ్స్ కు పూజలు చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక పైన కనిపిస్తున్న ఫోటో మెగాస్టార్ చిరంజీవి త్రిపాత్రాభినయం చేసిన ముగ్గురు మొనగాళ్లు సినిమాలోది. ఆ సినిమా ఓపినింగ్ సందర్భంగా వేణు స్వామి పూజలు చేశారు. ఈ ఓల్డ్ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.