
పై ఫొటోలో క్యూట్‌గా కనిపిస్తున్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? కొంచెం కష్టమే. సినిమాలు రెగ్యులర్ గా చూసే వారు కూడా తనను గుర్తుపట్టలేరు. అలాగనీ ఈ బ్యూటీ క్రేజ్ తక్కువేమీ కాదు. పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అతిథి పాత్రలు, ప్రత్యేక పాటలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం.. ఇలా భాషతో సంబంధం లేకుండా అన్ని చిత్రపరిశ్రమల్లో నటిస్తూ మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. హాలీవుడ్లోనూ మెరిసిన ఘనత ఈ అందాల తార సొంతం. సినిమాల సంగతి పక్కన పెడితే..తన లాగే ఈ ముద్దుగుమ్మ ఆలోచనలు కూడా ఎంతో అందమైనవి. అందుకే ఒక అనాథ అమ్మాయిని దత్తత తీసుకుని సొంత కూతురిలా చూసుకుంటోంది. ఈ పాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్.. ఈ అమ్మాయి మరెవరో కాదు పాన్ ఇండియా బ్యూటీ సన్నీ లియోన్.
సన్నీ లియోన్ గతం గురించి పక్కన పెడితే ఇండియాకు వచ్చాక ఇక్కడి ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలనే ఫాలో అవుతోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ హిందీతో పాటు దక్షిణాది సినిమాల్లోనూ నటిస్తోంది. తెలుగులో కరెంట్ తీగ, జిన్నాసినిమాల్లో మెరిసిందీ అందాల తార. సన్నీ లియోన్ క్రేజ్ ఎలా ఉందంటే.. ఇటీవల ఆమె పుట్టిన రోజును పురస్కరించుకుని కర్ణాటకలోని కొందరు యువకులు ఆమె భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకొన్నారు. కారణమడిగితే.. ‘ మేం సన్నీ లియోన్ సినిమాలతో పాటు ఆమె సామాజిక సేవా కార్యక్రమాలకు కూడా అభిమానులం. ముఖ్యంగా కరోనా సమయంలో ఆమె చాలామందికి భోజనాలు ఏర్పాటు చేసి ఆకలి తీర్చింది’ అని తన అందమైన మనసు గురించి చెప్పుకొచ్చారు.
@SunnyLeone hi in a small village of India Name Karkalli, Karnataka state. The sunny leone fans celebrate her birthday very lovely 🌹🌹🌹 pic.twitter.com/bgk8H5Uk3T
— Surendra Cs (@cs_surendr39547) May 15, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.