
సోషల్ మీడియా విస్తృతి పెరిగాక సెలబ్రిటీలు, అభిమానులకు దూరం బాగా తగ్గిపోయింది. సినిమా తారలు నిత్యం తమ గ్లామరస్ ఫొటోలు, ఫ్యాషనబుల్ ఫిక్స్ షేర్ చేసుకోవడం, ఫ్యాన్స్ వాటిని షేర్ చేస్తూ వైరల్ చేయడం సర్వసాధారణమైపోయింది. పై ఫొటో కూడా అలాంటిదే. పాన్ ఇండియా రేంజ్‌లో స్టార్‌డమ్ సొంతం చేసుకున్న ఓ స్టార్ హీరోయిన్ ఈ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. అలా షేర్ చేసిందో లేదో.. క్షణాల్లోనే వైరల్‌గా మారింది. కళ్లతోనే కనికట్టు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయమే. తెలుగు సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆతర్వాత బాలీవుడ్‌కు వెళ్లింది. స్టార్ హీరోలు, యంగ్ స్టార్స్‌తో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. ఆమె చేతిలో ప్రస్తుతం పలు పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇంతకీ కళ్లతోనే కుర్రాళ్ల హృదయాలకు గాలమేస్తోన్న ఈ కుందనపు బొమ్మ మరెవరో కాదు..
బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కృతి సనన్. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన లేటెస్ట్ ఫొటోలను ఫ్యాన్స్ తో పంచుకుంది. దీంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. ఇక ఆమె సినిమా కెరీర్ విషయానికొస్తే.. మహేశ్‌బాబు- సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన నేనొక్కడినే సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆతర్వాత నాగచైతన్యతో దోచేయ్ సినిమాలో సందడి చేసింది. అయితే పెద్దగా క్లిక్ కాలేకపోయింది. ఆతర్వాత బాలీవుడ్‌కు చెక్కేసింది. అక్కడ స్టార్ హీరోలతో సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరోపంటి, దిల్‌వాలే, రాబ్తా, బరేలీ కీ బర్ఫీ, స్త్రీ, లుకాచుప్పి, హౌస్‌ఫుల్ 4, పతీ పత్నీ ఔర్ వో, మిమి, భేడియా, షెహ్‌జాద సినిమాలతో స్టార్ హీరోయిన్ స్టేటస్ అనుభవిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్‌లో ఆమె సీతగా నటిస్తోంది. దీంతో పాటు గణ్‌పత్ అనే చిత్రంలోనూ హీరోయిన్‌గా ఎంపికైంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..