సినీ సెలబ్రిటీలకు, ఫ్యాన్స్‌కు సోషల్ మీడియా ఓ వారధిలా నిలుస్తోంది. ఎప్పటికప్పుడు తమ ఫేవరెట్ హీరోహీరోయిన్ల సినిమాలకు సంబంధించిన అప్డేట్స్, లేటెస్ట్ ఫోటోలను ఇంటర్నెట్ ద్వారా అభిమానులకు క్షణాల్లో దర్శనమిస్తున్నాయి. ఇక ఈ మధ్యకాలంలో హీరోయిన్లకు చెందిన చైల్డ్‌హుడ్ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. మరి లేటెస్ట్గా చక్కర్లు కొడుతోన్న ఓ స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటోపై లుక్కేద్దాం.
పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? ఎంచక్కా ఆట ఆడుతోన్న ఓ ఇద్దరు చిన్నారులను మీరు చూడవచ్చు. వారిలో ఓ స్టార్ హీరోయిన్ ఉంది. మోడలింగ్‌తో తన కెరీర్ ప్రారంభించి.. తెలుగులో స్టార్ హీరోతో తొలి చిత్రంలో ఆడిపాడింది. ఆ తర్వాత బాలీవుడ్లో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ.. ఆ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమెవరో కనిపెట్టారా.? ఇంకా లేదంటే.. మీకో క్లూ..! ఈ బ్యూటీ తెలుగులో నటించిన తొలి చిత్రం హీరో మహేష్ బాబు.
ఎస్.! మీరనుకున్నది కరెక్ట్.. ఆమె మరెవరో కాదు.. కృతి సనన్. మోడలింగ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన కృతి.. పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్‌కు సంబంధించిన యాడ్స్‌లో నటించింది. ఆ తర్వాత 2014లో అటు తెలుగులో ‘1- నేనొక్కడినే’, ఇటు హిందీలో ‘హీరోపంతి’ చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది. ఆ వెంటనే నాగచైతన్యతో ‘దోచేయ్’ మూవీలో నటించిన కృతికి.. తెలుగులో అవకాశాలు తక్కువైయ్యాయి. అయితేనేం హిందీలో మాత్రం వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. అక్కడ స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
యువ హీరోల దగ్గర నుంచి సీనియర్ హీరోల వరకు అందరితోనూ కలిసి ఆడిపాడింది. ‘రాబ్తా’, ‘బరేలి కి బర్ఫీ’, ‘లుక చుపి’, ‘పతి పత్ని ఔర్ వో’, వంటి సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. కాగా, ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వచ్చిన పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’, టైగర్ ష్రాఫ్‌తో ‘గణపత్’, మరో అన్టైటిల్డ్ సినిమాలో నటిస్తోంది.