Tollywood: రజనీకాంత్ వీరాభిమాని.. ఆ భయంకరమైన వ్యాధిని ఎదిరించి టాలీవుడ్ హీరోగా.. ఎవరో గుర్తు పట్టారా?

సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సామాన్య జనాలే కాదు స్టార్ హీరోలు సైతం ఆయనను అమితంగా అభిమానిస్తారు. ఈ దక్షిణాది హీరోకు కూడా రజనీకాంత్ అంటే వల్లమాలిన అభిమానం. ఆయనను ఓ గురువులా భావిస్తాడీ డైరెక్టర్

Tollywood: రజనీకాంత్ వీరాభిమాని.. ఆ భయంకరమైన వ్యాధిని ఎదిరించి టాలీవుడ్ హీరోగా.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actor

Updated on: Oct 30, 2025 | 5:32 PM

పై ఫొటోను గమనించారా? అందులో రజనీకాంత్ ను ఈజీగా గుర్తు పట్టవచ్చు. అయితే ఆయన పక్కనే సర్కిల్ లో ఉన్న పిల్లాడిని గుర్తు పట్టారా? ఆ పిల్లాడు ఇప్పుడు పెరిగి పెద్దయ్యాడు. దక్షిణాదిలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు డైరెక్టర్ గానూ సత్తా చాటాడు. అయితే ఈ నటుడు చిన్నతనంలోనే బ్రెయిన్ ట్యూమర్ బారిన పడ్డాడు. మనో ధైర్యంతో దానిని అధిగమించి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.  మొదట సైడ్ డ్యాన్సర్ గా కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత కొరియోగ్రాఫర్ గా సక్సెస్ అయ్యాడు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోల సినిమాలకు నృత్య రీతులు సమకూర్చాడు. నృత్య దర్శకుడిగా 4 ఫిలిం ఫేర్ అవార్డులు, 3 నంది పురస్కారాలు కూడా అందుకున్నాడు. ఇక మెగా ఫోన్ పట్టి డైరెక్టర్ గానూ సక్సెస్ అయ్యాడు. నాగార్జున, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు తీశాడు. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఈ హీరోను కోట్లాది మంది అభిమానించడానికి ప్రధాన కారణం అతను చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలే. ఒక సేవా ఫౌండేషన్ ను నెలకొల్పి ఎంతో మంది పిల్లలకు గుండె చికిత్స లు చేయించాడు. వేలాది మంది అనాథలకు ఆశ్రయం కలిపించారు. సొంతంగా వృద్ధ, అనాథశ్రమాలు ఏర్పాటు చేసి ఎంతో మందికి నీడను అందిస్తున్నాడు. అనాథ, పేద పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నాడు. రైతులకు ట్రాక్టర్లు అందజేస్తున్నాడు. మహిళలకు కుట్టు మిషన్లు అందజేస్తున్నాడు. కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానంటూ ఆపన్న హస్తం అందించడంలో ముందుంటాడీ హీరో. అందుకే అతనిని రియల్ హీరో అభివర్ణిస్తారు. మరి అతనెవరో ఈ పాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది. పై ఫొటోలో రజనీతో ఉన్నది మరెవరో కాదు రాఘవ లారెన్స్. ఈరోజు (అక్టోబర్ 29) అతని పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో లారెన్స్ కు సంబంధించి పలు ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ప్రస్తుతం దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో రాఘవ లారెన్స్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ మధ్యన అతను ఎక్కువగా హీరోగానే కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ముని-4 షూటింగ్ లో బిజి బిజీగా ఉంటున్నాడు లారెన్స్. ఇందులో పూజా హెగ్డే దయ్యంగా నటించనుందని ఆ మధ్యన రూమర్లు వినిపించాయి.

ఇవి కూడా చదవండి

రజనీకాంత్ తో రాఘవ లారెన్స్..

 

కాగా రజనీకాంత్ ను లారెన్స్ అమితంగా అభిమానిస్తారు. నిజం చెప్పాలంటే ఆయనను ఒక గురువులా భావిస్తారు. తీరికదొరికనప్పుడల్లా రజనీ ఇంటికి వెళ్లి కలుస్తుంటాడు. కాగా రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమా సీక్వెల్ లో రాఘవ లారెన్స్ హీరోగా నటించాడు. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.